శుక్రుడిని.. సంపద, శ్రేయస్సు, ప్రేమకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడి సంచారం కొన్ని రాశుల ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. త్వరలో శుక్రుడి రాశి మార్పుతో మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. దానివల్ల ఏ రాశివారికి లాభం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు.. సమయానుసారం రాశులు, నక్షత్రాలను మారుస్తుంటాయి. రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. ఆ యోగాల ప్రభావం 12 రాశి చక్రాలపై పడుతుంది. రాజయోగాలు కొన్ని రాశులవారికి మేలు చేస్తే, మరికొన్ని రాశులవారికి చెడు చేసే అవకాశం ఉంది.
శుక్రుడు.. దాదాపు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు. జూన్ 29 న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 26 వరకు అక్కడే ఉంటాడు. వృషభ రాశికి అధిపతి కూడా శుక్రుడే.
శుక్రుడు తన సొంత రాశిలో సంచరించడం వల్ల మాళవ్య అనే గొప్ప రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శక్తివంతమైంది. ప్రభావవంతమైంది. మాళవ్య రాజయోగం 3 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. మరి ఆ రాశులేంటో వారికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
24
మేష రాశివారిపై మాళవ్య రాజయోగం ప్రభావం ఎలా ఉంటుందంటే?
మేష రాశి వారికి.. శుక్ర సంచారం వల్ల ఏర్పడే మాళవ్య రాజయోగం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది ఆర్థిక లాభాలను తెచ్చే యోగం. ఈ యోగం వల్ల మేషరాశి వారికి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇది మంచి సమయం. కొత్త అవకాశాలు రావచ్చు. ఉన్న ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పదోన్నతులు లేదా జీతం పెరిగే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.
34
వృషభ రాశివారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
వృషభ రాశిలోనే మాళవ్య యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి చాలా శుభప్రదం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ పని చేపట్టినా విజయం మీ సొంతం అవుతుంది.
వృషభ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగులకు ఇది మంచి సమయం. మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యతగా ఉంటారు. వారి సాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు.
ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తి చేసి ప్రశాంతంగా ఉంటారు.
కుంభ రాశి వారికి శుక్ర సంచారం వల్ల ఏర్పడే మాళవ్య రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం చేకూరుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
చేపట్టన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. సొంతింటి కల నెరవేరుతుంది.