జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రాశుల వారు భాగస్వామిగా వస్తే అంతకంటే అదృష్టం లేదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి ఏ రాశుల వారు భాగస్వామిగా వస్తే జీవితం అందంగా, ఆనందంగా మారుతుందో ఇక్కడ తెలుసుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు కుటుంబం, వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవిత భాగస్వామి, పిల్లలకు జీవితాంతం రక్షణ కల్పిస్తారు. వారికి తోడుగా ఉంటారు. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.
26
కర్కాటక రాశి
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు భావోద్వేగ బంధానికి ప్రాధాన్యమిస్తారు. వీరికి కుటుంబమే ప్రపంచం. వారి తర్వాతే మరెవరైనా అనుకుంటారు.
36
కన్య రాశి
కన్య రాశి వారు వివాహం, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారు తమ జీవిత భాగస్వామికి, ప్రేమికులకు ఎక్కువ విలువ ఇస్తారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తారు.
46
తుల రాశి
తుల రాశి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశి వారు సంతోషంగా ఉండటమే కాకుండా ఇతరులను ఎలా సంతోషపెట్టాలో కూడా వీరికి బాగా తెలుసు. ఎవ్వరి మనసు నొప్పించకుండా ఉండేందుకు ఈ రాశివారు ప్రయత్నిస్తారు.
56
మకర రాశి
మకర రాశి వారు బాధ్యతగా ఉంటారు. కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సంప్రదాయాలను గౌరవించే వ్యక్తులు. కుటుంబానికి, భాగస్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తారు.
66
మీన రాశి
మీన రాశి అధిపతి గురువు. ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి, ప్రేమికులు, స్నేహితులతో నిజాయితీగా ఉంటారు. వారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు.