న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 2, 4, 8,11,13, 17, 20, 22, 26, 29వ తేదీల్లో జన్మించిన వారు ఎంత కష్టపడినా, ఆ కష్టపడిన దానికి తగిన గుర్తింపు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. నిజానికి, ఈ తేదీల్లో పుట్టిన వారు పని చేయడం కంటే, ఆలోచించడానికే ఎక్కువ సమయం తీసుకుంటారు.వీరి మెదడులో చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. అద్భుతంగా ఆలోచిస్తారు. కానీ.. ఆ ప్రణాళికలను అమలు చేసే సమయం వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతారు. అందుకే, ఎంత తెలివి తేటలు ఉన్నా వీరికి విజయం దక్కడం ఆలస్యం అవుతుంది.