మీన రాశి వారికి శని సంచారంతో సాడేసాతి మధ్య దశ ప్రారంభమైంది. మీన రాశి వారు శని సాడేసాతి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి కష్టకాలం ప్రారంభం కావచ్చు. శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం దెబ్బతినవచ్చు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్న ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. ఓపికగా ఉండడం మంచిది.