ఉద్యోగులు మంచి గుర్తింపును పొందుతారు. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు. ఇన్నాళ్లుగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారవేత్తలకు ఈ రోజు బాగుంటుంది. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మంచి లాభాలను పొందుతారు.
ఆరోగ్యం
సింహరాశివారికి ఈ రోజు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. రోజులాగే ఒత్తిడి ఉంటుంది. కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏం రావు. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తూ విశ్రాంతి తీసుకుంటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.