Sankranti Donation: సంక్రాంతి నాడు చేసే దానానికి ఎంతో ఫలితం ఉంటుంది. కొన్ని రకాల వస్తువులు దానం చేయడం ద్వారా మీరు డబ్బు కష్టాలను తొలగించుకోవచ్చు. ఎలాంటి వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.
మకర సంక్రాంతి అతి పెద్ద పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ పండుగ నాడు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల శుభకాలం మొదలవుతుంది. అంటే శుభకార్యాలు ఇక చేసుకోవచ్చు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే క్షణం మనం పుణ్యం సంపాదించేందుకు అత్యంత శుభప్రదమైన రోజు. ఇక మకర సంక్రాంతినాడు తలకు స్నానం చేసి దానం చేయడం వల్ల ఎన్నో పుణ్యఫలితాలు కలుగుతాయి. ఆరోజు ఏవి దానం చేయాలో ఇక్కడ ఇచ్చాము.
25
నువ్వులు బెల్లం
మకర సంక్రాంతి నాడు నువ్వులు బెల్లం కలిపి దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలా చేస్తే శని, సూర్య గ్రహాలకు శాంతి కలుగుతుంది. అలాగే సంక్రాంతి నాడు మీ సామర్థ్యం మేరకు పేదవాడికి లేదా బ్రాహ్మణుడికి డబ్బును దానం చేస్తే మంచిది. ఇది మీ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది.
35
బియ్యం పప్పులు
మకర సంక్రాంతినాడు బియ్యం, పప్పులు కలిపి కిచిడిని వండుతారు. ఈ కిచిడిని కూడా దానం చేయడం అత్యంత శుభప్రదంగా చెబుతారు. ఇంటికి వచ్చే పేదలకు ఈ కిచిడిని దానం చేసి తినమని చెప్పండి. లేదా మీ ఇంటి దగ్గరే భోజనం పెట్టండి. ఇది మీకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే మకర సంక్రాంతి అనేది శీతాకాలంలో వస్తుంది. అవసరమైన వారికి దుప్పట్లు, బూట్లు చెప్పులు వంటి విధానం చేస్తే రాహువు, శనికి చెందిన చెడు ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి.
మకర సంక్రాంతి రోజున స్వచ్ఛమైన దేశీ నెయ్యిని దానం చేస్తే మీ కెరీర్లో, విజయం, గౌరవం దక్కుతాయి. అలాగే అదే రోజు గోధుమలు, బియ్యం, చలికాలంలో దొరికే పండ్లు, కూరగాయలను దానం చేయడం కూడా ఎంతో శుభప్రదమైనదిగా చెబుతారు. అలాగే ఆవనూనెను దానం చేయడం వల్ల శని చెడు ప్రభావాలను తొలగించుకోవచ్చు.
55
పసుపు, తేనె
మకర సంక్రాంతి రోజున పసుపు దానం చేయడం కూడా ఎంతో శుభప్రదం. కానీ చాలామంది పసుపును దానం చేసేందుకు ఇష్టపడరు. నిజానికి పసుపు దానం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తేనెను దానం చేసేందుకు కూడా ప్రయత్నించండి. ఇది జీవితంలో మాధుర్యాన్ని పెంచుతుంది. మీకున్న చాలా దోషాలను తొలగిస్తుంది.