Mauni Amavasya: అమావాస్య చీకట్లు.. ఈ ఐదు రాశుల జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయం

Published : Jan 14, 2026, 07:30 AM IST

Mauni Amavasya: ఈ ఏడాది 2026 మొదటగా వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్య అని పిలుస్తారు. జనవరి 18వ తేదీన ఈ అమావాస్య రానుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఐదు రాశుల జీవితాలను అద్భుతంగా మార్చనుంది. 

PREV
16
Mauni Amavasya

జోతిష్యశాస్త్రంలో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఎక్కువగా దాన ధర్మాలు, నదీ స్నానాలు ఎక్కువగా ఆచరిస్తారు. అంతేకాదు.. మౌని అమావాస్య కాబట్టి.. ఎక్కువగా మౌన వ్రతం చేస్తారు. అయితే.. ఈ అమావాస్య వస్తూ వస్తూ... ఐదు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకువస్తోంది. మరి, ఆ ఐదు రాశులేంటో చూద్దాం...

26
కుంభ రాశి...

మౌని అమావాస్య కుంభ రాశివారికి చాలా శుభ ఫలితాలను తీసుకురానుంది. కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. మీ అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ప్రతి రంగంలోనూ గౌరవ, మర్యాదలు పొందడంతో పాటు విజయం సాధిస్తారు. బంధువులతో బంధం బలపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

36
మేష రాశి...

మౌని అమావాస్య మేష రాశివారికి కూడా చాలా శుభప్రదంగా మారనుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బలం, ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన పనులన్నీ విజయవంతమౌతాయి. మీ మాటలు ప్రజలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా మీ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా మారుతుంది. అమావాస్య రోజున ఆకుపచ్చ దుస్తులు వేసుకోవడం వల్ల శుభం కలుగుతుంది.

46
మకర రాశి..

మకర రాశి వారికి మౌని అమావాస్య చాలా మంచి రోజు అవుతుంది. ఇది మీరు గత సమస్యలకు పరిష్కారాలను పొందే రోజు. దైవానుగ్రహంతో, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. ఒంటరిగా ఉండి, భాగస్వామి కోసం చూస్తున్న వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త సంబంధాన్ని ప్రారంభించవచ్చు. సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు ప్రత్యేకమైనది.

56
మిథున రాశి..

మిథున రాశి వారికి మౌని అమావాస్య ఒక అద్భుతమైన రోజు అవుతుంది. ఈ రోజున, మీరు చేపట్టే ఏ పనిలోనైనా ప్రజల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీ స్నేహితుల నుండి సహాయం ఆశించవచ్చు. మౌని అమావాస్య మీకు అనుకూలమైన సమయం.మీ కెరీర్‌లో కొత్త శిఖరాలను చేరుకోవడం గురించి మీరు ఆలోచించవచ్చు.

66
కన్య రాశి..

కన్య రాశి వారికి మౌని అమావాస్య మీ ఉద్యోగాలు, వ్యాపారాలలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున మీకు ఒక పెద్ద ఆఫర్ రావచ్చు, లేదా ముందుకు సాగడానికి ఒక ముఖ్యమైన అవకాశం లభించవచ్చు. మీ హోదా, ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉంది. మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నందున, మీ కలలను నిజం చేసుకోవడానికి మీరు చర్యలు తీసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories