రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? బెడ్రూమ్ లో ఈ మార్పులు చేయాల్సిందే

Published : Oct 29, 2025, 05:42 PM IST

Vastu Tips: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.  మరీ ముఖ్యంగా నిద్ర సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. అందుకే, బెడ్రూమ్ విషయంలో కొన్ని వాస్తు మార్పులు చేసుకోవాలి.   

PREV
16
బెెడ్రూమ్ లో అద్దం...

బెడ్రూమ్ లో పొరపాటున కూడా అద్దం పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ గదిలో అద్దం పెట్టడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది.  అందుకే వెంటనే తీసేయకూడదు. తీసేయడానికి కుదరకపోతే, రాత్రి పడుకునే సమయంలో ఆ అద్దాన్ని ఏదైనా క్లాత్ తో  కవర్ చేయాలి.  అంతేకాకుండా.. బెడ్రూమ్ లో పొరపాటున కూడా ఎప్పుడూ చీపురు పెట్టకూడదు.

26
ఎలక్ట్రానిక్ వస్తువులు

చాలా మంది తమ బెడ్రూమ్ లో టెలివిజన్ లేదా కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచుతారు, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది శుభం గా పరిగణించరు. కాబట్టి, ఈ వస్తువులను మీ  బెడ్రూమ్ లో ఉంచడం మానుకోండి. ఎందుకంటే అలా చేయడం వల్ల నిద్రలేమి ప్రమాదం పెరుగుతుంది.

36
మంచం సరైన దిశ

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో బెడ్రూమ్  ఈశాన్య దిశలో మంచాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఇది మీ నిద్రకు ఆటంకం కలిగించవచ్చు, సరిగ్గా నిద్రపోకుండా చేస్తుంది.

46
మంచం మీద భోజనం చేయవద్దు

మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది, మంచి నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి, సంతోషం కలుగుతాయి, ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.

56
నెయ్యి దీపం

మీరు తరచుగా నిద్ర మధ్యలో మేల్కొంటుంటే, నిద్రపోయే ముందు మీ బెడ్రూమ్ లో నెయ్యి దీపం వెలిగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం,  మంచం చెక్కతో చేయాలి. చదరపు ఆకారపు మంచం మీద పడుకోవడం కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

66
బెడ్రూమ్ లో వాటర్ బాటిల్

బెడ్రూమ్ లో నీళ్ల బాటిల్ లేదా మరేదైనా పాత్రను ఎప్పుడూ ఉంచకూడదు. నిజానికి, నీరు మనస్సు, మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి.. దాహం వేస్తే.. లేచి వెళ్లి వాటర్ తాగడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories