Birth Month: ఈ మూడు నెలల్లో పుట్టిన వారు కచ్చితంగా సక్సెస్ అవుతారు

Published : Nov 30, 2025, 10:22 AM IST

Birth Month: జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం ఈ మూడు నెలల్లో పుట్టినవాళ్లు కచ్చితంగా విజయం సాధించి తీరుతారు. వీరు సవాళ్లను ఎదుర్కొని సక్సెస్ అవుతారు. వీరు తాము పెట్టుకున్న లక్ష్యాలను సాధించే వరకు నిద్రపోరు. ఆ మూడు నెలలు ఏవో తెలుసుకోండి.

PREV
14
ఈ మూడు నెలల్లో పుడితే

వేద జ్యోతిషశాస్త్రం, సంఖ్యా శాస్త్రం  చెబుతున్న ప్రకారం మనం పుట్టే నెలలు కూడా మన జీవితాన్ని నిర్దేశించాయి. ఎవరైనా కూడా జీవితంలో విజయం సాధించాలనే కోరుకుంటారు.  కానీ దానికి అదృష్టం కూడా కలిసి రావాలి.  విజయం సాధించడానికి ఎంతో మంది ప్రయత్నించినా కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు.జ్యోతిషం ప్రకారం కొన్ని ప్రత్యేక నెలల్లో పుట్టినవాళ్లు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఆ నెలల్లో జన్మించారో లేదో తెలుసుకోండి.

24
జనవరి

జనవరిలో పుట్టినవాళ్లు ఎంతో మంచి జీవితాన్ని గడుపుతారు. వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ నెలలో పుట్టినవాళ్లు సవాళ్లకు భయపడరు. వాటిని సులువుగా అధిగమిస్తారు. తమకు నచ్చిన పనిలో విజయం సాధించే వరకు ఆగరు. వీరు తమ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తారు. ఓటమికి వీరు ఏమాత్రం భయపడరు. ఓటమిని స్పూర్తిగా తీసుకుని ముందుగా సాగుతారు. అందుకే వీరు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.

34
మార్చి నెల

జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి నెల ఎంతో మంచిది. ఈ నెలలో పుట్టినవాళ్లకు సానుభూతి ఎక్కువ.  అలాగే  పరిస్థితికి తగ్గట్టుగా వారు సర్దుకుపోతారు. వీరికి స్వేచ్ఛా ఎక్కువగా కావాలి. వీరు  విజయం  కోసం ఎన్ని నెలలైనా కష్టడపతారు. వీళ్లు తాము సక్సెస్ అయ్యేవరకు వెనక్కి తగ్గరు.

44
నవంబర్

డిసెంబర్‌లో పుట్టినవాళ్లు ఎంతో చక్కగా పనిచేస్తారు. వీరి ఆలోచన చాలా విలక్షణంగా ఉంటాయి.  వీరికి ఆలోచన, దూరదృష్టి ఉంటుంది. తెలియని విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకాడరు. విజయం సాధించడానికి అనేక కోణాల్లో ఆలోచించి పనిచేస్తారు. ప్రణాళిక విఫలమైతే కుంగిపోరు. కొత్త దారిని కనుగొని ముందుకు సాగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories