జనవరిలో 2026లో అద్భుత కలయిక జరగబోతోంది. మకర రాశిలో సూర్యుడు, కుజుడు కలవబోతున్నారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. నిజానికి సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు జనవరి 14, 2026న మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక కుజుడిని ధైర్యం, శక్తికి కారకుడిగా చెబుతారు. మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. కుజుడు మకరరాశిలో ఉచ్ఛస్థితిలో, కర్కాటకంలో నీచస్థితిలో ఉంటాడు. కుజుడు జనవరి 16, 2026న మకరరాశిలోకి ప్రవేశించి అక్కడే ఫిబ్రవరి 23 వరకు ఉంటాడు. ఈ కాలం కొంతమందికి విపరీతంగా కలిసి వస్తుంది.