పితృపక్షంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని వారికి శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మన దేశంలో ఉన్న ఒక ఆలయంలో మాత్రం జీవించి ఉన్నవారు తమకు తామే పిండ ప్రదానం (Pind Daan) చేస్తారు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో? అలా ఎందుకు చేస్తారో తెలుసుకోండి.
హిందూ ధర్మంలో పితృ పక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులు 15 రోజుల పాటు భూమి మీదకి వస్తారని అంటారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పితృ దేవతలకు శ్రాద్ధ కార్యక్రమాలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల మరణించినవారి ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు. వారు సంతృప్తి చెంది తమ లోకానికి తిరిగి వెళతారనే నమ్మకం ఉంది.
26
మరణించిన వారికే పిండ ప్రదానం
సాధారణంగా శ్రాద్ధం, పిండ ప్రదానం మరణించినవారికి మాత్రమే చేస్తారు. అంటే, మరణించిన వ్యక్తులు పితృ దేవతలు అవుతారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు పితృపక్షంలో పితృల శ్రాద్ధం చేస్తారు. దీనివల్ల వారు మోక్షం పొందుతారని నమ్మకం.
36
ఇక్కడ తమకు తామే పిండ ప్రదానం
మన దేశంలో ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయంలో జీవించి ఉన్న వ్యక్తి వెళ్లి తన పిండ ప్రదానం చేసకోవచ్చు. ఈ దేవాలయం బీహార్‌లోని గయాలో ఉంది. ధార్మిక గ్రంథాలలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది.
నమ్మకాల ప్రకారం గయలోని ఈ ఆలయానికి వెళ్లి పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. పూర్వీకుల రుణం నుండి విముక్తి లభిస్తుంది. త్రేతాయుగంలో, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత గయలో ఫల్గుణ నది ఒడ్డున దశరథుడి శ్రాద్ధం, పిండ ప్రదానం చేశారని చెబుతారు.
56
బతికుండగా పిండ ప్రదానం ఎందుకు?
గయలో దాదాపు 54 పిండ దేవతలు, 53 పవిత్ర స్థలాలు ఉన్నాయి. అక్కడ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తే మంచిదని నమ్ముతారు. ఇక్కడ జనార్ధన మందిరం వేదిక ఉంది. ఇక్కడ ప్రజలు బతికుండగానే మరణానంతరం మోక్షం పొందడానికి తమకు తామే పిండ ప్రదానం చేసుకుంటారు.
66
శ్రాద్ధం చేయడానికి ఇదే కారణం
సాధారణంగా, సంతానం లేనివారు లేదా కుటుంబంలో పిండ ప్రదానం చేసేవారు ఎవరూ లేని వారు మాత్రమే గయాకు వెళ్లి తమకు తామే పిండ ప్రదానం చేసుకుంటారు. అలాంటి వారు తమ ఆత్మకు శాంతి కలగాలని బతికుండగానే పిండ ప్రదానం చేస్తారు.