ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో సూర్య గ్రహణం ఇది. సెప్టెంబర్ 21న రాత్రి 10:59న గ్రహణ కాలం మొదలౌతుండగా... తెల్లవారుజామున 3: 23 వరకు ముగియనుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించనప్పటికీ... గ్రహాల ప్రభావం మాత్రం... మనపై చాలా ఎక్కువగానే ఉండనుంది.
ఈ గ్రహణ సమయంలో బుధుడు హస్త నక్షత్రంలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. రాహువు పూర్వాభాద్రపద నక్షత్రంలో, చంద్రుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. గ్రహణ సమయంలోనే ఈ నక్షత్ర మార్పులు జరుగుతుండటం... మూడు రాశులకు చాలా మంచి ప్రయోజనాలను కలిగించనుంది. ముఖ్యంగా ఆ మూడు రాశుల అదృష్టానికి తలుపులు తెరచుకోనున్నాయి. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...