Horoscope 2026: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు ఓ ఇంటివారవుతారు, సొంతిల్లు కొనే ఛాన్స్

Published : Nov 19, 2025, 05:11 PM IST

Horoscope 2026: కొత్త ఏడాది 2026 వచ్చేస్తోంది. కొన్ని రాశుల వారికి కొత్త ఏడాది విపరీతంగా కలిసి వస్తుంది.  సొంత ఇల్లు కొనడానికి శుభ యోగం కూడా ఏర్పడబోతోంది. కొన్ని రాశుల వారు సొంత ఇంటి కలను నిజం చేసుకుంటారు. ఆ రాశులు ఇవే. 

PREV
15
మిథున రాశి

మిథున రాశి వారి 2026 కలిసి వస్తుంది.  వీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటే 2026 బాగా కలిసి వస్తుంది. వీరికి కొత్త ఏడాది అనుకూలంగా ఉంటుంది. శని సప్తమ దృష్టి కొత్త ఏడాదిలో నాలుగో ఇంటిపై ఉంటుంది. కొత్త ఏడాది మొదట్లో మాత్రం కొన్ని రోజులు మంచి కాలం కాదు. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 5 మధ్య మీ రాశిలో బుధుడు చాలా బలహీనంగా ఉంటాడు. ఈ సమయంలో ఇల్లు కొనుగోలు, భూమి లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది.

25
సింహ రాశి

సింహ రాశి వారికి కొత్త సంవత్సరం విపరీతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఇల్లు, భూమి లేదా ఆస్తి కొనాలనుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. వీరికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇల్లు లేదా భూమి కొనాలనుకుంటే వివాదాస్పదమైన వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి.

35
తులా రాశి

తులా రాశి వారికి 2026లో కొత్త ఇల్లు కొనేందుకు అవకాశం ఉంది.  భూమి లేదా ఆస్తి కొనడానికి ఇది అనుకూలమైన సమయం. కొత్త ఏడాదిలో ఈ రాశి వారి ఆరో ఇంట్లో  శని సంచరిస్తాడు. ఈ సమయంలో, మీకున్న అడ్డంకులు పోతాయి. ఈ సమయంలోనే  భూమి, ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించుకుంటే మంచిది. ఈ ఫలితాలు మీకు అనుకూలంగా వస్తుంది.

45
మకర రాశి

మకర రాశి వారికి 2026 అనేది ఇల్లు కొనడానికి అనుకూల సమయాన్ని అందిస్తుంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఏడాదిలో మకర రాశిలోని నాలుగో ఇంటిపై గ్రహాలకు సంబంధించి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. మీరు ప్రయత్నిస్తే భూమి, ఆస్తి విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

55
కుంభ రాశి

కుంభ రాశి వారికి కొత్త ఏడాదిలో ఇల్లు కొనడం, కట్టడం లేదా భూమి కొనడం గురించి ముందుకు వెళతారు. 2026 సంవత్సరం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి నాలుగో ఇంటిపై శని ప్రభావం ఉంటుంది. కాబట్టి వివాదాస్పద ఆస్తుల జోలికి వెళ్లకూడదు. అలాగే ఆస్తులను రహస్యంగా అమ్మకూడదు. మీకు ఇప్పటికే భూమి ఉంటే ఇల్లు కట్టడంలో తొందరపడకండి. ఆచి తూచి అడుగేయండి.

Read more Photos on
click me!

Recommended Stories