న‌వంబ‌ర్ 20 మార్గ‌శిర అమావాస్య‌.. ఈ రాశుల వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే..

Published : Nov 19, 2025, 03:06 PM IST

Zodiac sign: న‌వంబ‌ర్ 20వ తేదీ (గురువారం) మార్గశిర అమావాస్య వ‌స్తోంది. ఈ అమావాస్య రోజున కొంతమంది రాశులకు ప్ర‌తికూల ప్ర‌భావాలు ప‌డ‌నున్నాయి. కొంద‌రు రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

PREV
15
కన్య రాశి

ఈ అమావాస్య కన్య రాశి వారికి ఇబ్బందులు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన గౌరవం లేకపోవడం వల్ల మనసు బరువుగా అనిపించొచ్చు. ఏదైనా పనిని నిర్లక్ష్యం చేయకండి.

25
మకర రాశి – మానసిక ఒత్తిడి పెరగే సూచనలు

కుటుంబ సభ్యుల మాటలు కూడా మనసులో కలవరాన్ని పెంచవచ్చు. లక్ష్యంపై దృష్టి తగ్గే అవకాశం ఉంది. అన‌వ‌స‌ర ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది, కాబట్టి డబ్బు ఖర్చుపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

35
మిథున రాశి – మాటల కారణంగా సమస్యలు

ఈ రోజున మాటలపై నియంత్రణ అవసరం. చిన్న అపోహ పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. భూమి, ఆస్తికి సంబంధించిన వాదనలు చేయకండి. ఈ కార‌ణంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి.

45
కర్కాటక రాశి – ధన లావాదేవీల్లో జాగ్రత్త

ఈ అమావాస్య రోజున డబ్బు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఎవరినైనా నమ్మి నిర్ణయం తీసుకుంటే నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఖర్చులు పెరుగుతాయి.

55
వృశ్చిక రాశి – ఎవరినీ బాధపెట్టకండి

ఈ రోజున ఎవరినైనా అనవసరంగా బాధపెట్టకండి. వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మానసిక ప్ర‌శాంతత‌ దెబ్బతినే అవకాశం ఉంది. మార్గశిర అమావాస్య పూజలు, దానాలు చెడు ప్రభావం త‌గ్గిస్తాయి. పితృ తర్పణం చేయడం శుభంగా భావిస్తారు. చీమలకు పిండి వేయడం మంచిదని శాస్త్రాలు చెబుతాయి. అవసరమైన వారికి దానం చేస్తే చెడు ప్రభావం తగ్గుతుందని నమ్మకం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories