18 ఏళ్ల తర్వాత బుధ-కుజుల విపరీత రాజయోగం.. ఈ 3 రాశులకు సంపద రెట్టింపు కావడం పక్కా!

Published : Nov 19, 2025, 03:29 PM IST

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తుంటాయి. ప్రస్తుతం బుధుడు, కుజుడు కలిసి విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ ప్రభావంతో 3 రాశులవారికి శుభం జరుగుతుంది. 

PREV
14
విపరీత రాజయోగం 2025

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల యువరాజు అయిన బుధుడు.. తెలివితేటలు, సంభాషణ, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి వాటికి అధిపతి. బుధుడు ప్రతి 15 రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు. ఆ సమయంలో ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాడు. ప్రస్తుతం బుధుడు, కుజుడితో కలిసి వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో అస్తమించిన స్థితిలో ఉన్నాయి. ఈ స్థితిలో ఈ రెండు గ్రహాలు కలిసి విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీనివల్ల 3 రాశులవారికి ప్రయోజనం కలుగుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

24
మేష రాశి

మేష రాశి ఎనిమిదో ఇంట్లో కుజుడు, బుధుడు కలిసి విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. కాబట్టి మేష రాశి వారికి ఈ కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబం, బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోయి ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి. విడిపోయిన జంటలు మళ్లీ కలుస్తాయి. కొత్త బంధాలకు అవకాశాలు ఏర్పడతాయి. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

34
కన్య రాశి

కన్య రాశి మూడో ఇంట్లో బుధ, కుజ గ్రహాలు విపరీత రాజయోగం ఏర్పరుస్తున్నాయి. దీనివల్ల తోబుట్టువులతో ఉన్న గొడవలు ముగుస్తాయి. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి పంపకాలు సజావుగా జరుగుతాయి. దీర్ఘకాలిక కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. శత్రువులను ఓడించి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రభుత్వ, పరిపాలన సంబంధిత విషయాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు.

44
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి విపరీత రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాజయోగం ధనుస్సు రాశి 12వ ఇంట్లో జరుగుతుంది. ఇది వ్యయ స్థానం అయినా.. శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులే పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు వరుసగా జరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి. పని ప్రదేశంలో గౌరవం మర్యాద పెరుగుతాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు తమ ప్రయత్నాల్లో పురోగతిని చూస్తారు. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగాల వారు సానుకూల మార్పులను చూస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories