ఈ ఐదు రాశులవారు చాలా అదృష్టవంతులు.. వీరికి అసలు అప్పుల బాధలే ఉండవు..!

Published : Aug 25, 2025, 01:49 PM IST

3 గ్రహాలు పాలించే ఐదు రాశులకు జీవితంలో అప్పుల బాధ అస్సలు ఉండదు. మరి, ఆ రాశుల్లో మీ రాశి ఉందా? తెలుసుకోండి...

PREV
16
zodiac signs

వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, తొమ్మిది గ్రహాల్లో కొన్ని శుభ ఫలితాలను అందించడంలో ముందుంటే, కొన్ని గ్రహాలు అశుభ ఫలితాలను కూడా అందిస్తాయి. 12 రాశులలో శని, రాహువు, కేతువు, కుజుడు గ్రహాలను అశుభమైనవిగా.. బృహస్పతి, శుక్రుడు,బుధుడు, సూర్యుడు, చంద్రుడులను మాత్రం శుభమైనవిగా భావిస్తూ ఉంటారు. ఈ గ్రహాలు పాలించే రాశులపై కూడా ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో.. కొన్ని గ్రహాలను పాలించే రాశులవారికి జీవితంలో ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు.. వారికి అప్పుల బాధలు అస్సలు రావు. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా....

26
1.వృషభ రాశి...

వృషభ రాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువ. వీరు చాలా అదృష్టవంతులు. తెలివైనవారు కూడా. ఈ రాశివారు అందరినీ చాలా ఎక్కువగా గౌరవిస్తారు. కెరీర్, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు.వృషభ రాశిని శుక్రగ్రహం పాలిస్తూ ఉంటుంది. కాబట్టి, ఈ రాశివారికి అంతా మంచే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీరికి ఆర్థిక సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు. అస్సలు అప్పులు చేయరు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా కూడా చాలా తక్కువ సమయంలోనే తీర్చేయగలరు.

36
2.మిథున రాశి...

మిథున రాశి వారు చాలా తెలివైన వారు. ఈ రాశివారు ఇతరులకన్నా ఎక్కువ జ్ఞానం, అవగాహన, నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇతరలు చెప్పిన ప్రతి విషయాన్ని అంత తొందరగా నమ్మరు. మోసం చేసేవారి నుండి వీరు ఎప్పుడూ దూరంగా ఉంటారు. డబ్బు విషయంలోనూ వీరు చాలా తెలివిగా ఉంటారు. ఎవరినీ నమ్మి డబ్బులు ఇవ్వరు. లాభ నష్టాలు ఆలోచించకుండా అడుగు వేయరు. వారు భవిష్యత్తును తెలుసుకుని తమ జీవితాలను గడుపుతారు. అందువల్ల, వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. దీనికి కారణం మిథున రాశి వారికి ఉన్న జ్ఞానం, కానీ దానిని పాలించే గ్రహం మరొక కారణం. మిథున రాశిని తెలివైన గ్రహం బుధుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ గ్రహం దయ కారణంగా, మిథున రాశి వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు. వీరికి అస్సలు అప్పులు ఉండవు.

46
3.కన్య రాశి..

కన్య రాశివారు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. వారు తమ తెలివితేటలకు అతీతంగా ఏదైనా విషయం గురించి, లాభం, నష్టం గురించి ఆలోచిస్తారు. అందువల్ల, ఈ రాశివారు ఎప్పుడూ డబ్బు సమస్యలు, అప్పులను ఎదుర్కోరు. ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా డబ్బు అప్పుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా.. చాలా తక్కువ సమయంలోనే ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తారు. కన్య రాశివారు సహజంగా చాలా తెలివైనవారు. వారు చాలా జ్ఞానవంతులు. వారు అన్ని పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారు. ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా ఉంటారు.

56
4.తుల రాశి..

తులారాశి పాలక గ్రహం శుక్రుడు. ఇది అందం, సంపద, విలాసం, శ్రేయస్సును సూచించే గ్రహం. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడి స్థానం వైవాహిక జీవితం, ఆర్థిక స్థితి , సామాజిక స్థితిని నిర్ణయిస్తుంది. శుక్రుడిని ఆనందం, అందం, అదృష్టానికి దేవత అని కూడా పిలుస్తారు. శుక్ర గ్రహం ఈ రాశివారికి ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం , జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. అందువల్ల, తులారాశి వారు తరచుగా రుణ సమస్యలను ఎదుర్కోరు.

66
5.ధనస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఆర్థిక విషయాలలో వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోవటానికి ఇష్టపడరు. అందువల్ల, రుణాలు తీసుకునేటప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ఎవరి నుండి తమ శక్తికి మించి డబ్బు తీసుకోరు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం వీరికి పెద్దగా నచ్చదు. ధనుస్సును బృహస్పతి పాలిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతిని గొప్ప గ్రహం , గ్రహాల రాజు అని పిలుస్తారు. తొమ్మిది గ్రహాలలో బృహస్పతి అత్యంత శుభప్రదమైన గ్రహం. ఈ గ్రహం ప్రత్యేక ఆశీర్వాదాల కారణంగా, ధనుస్సు రాశివారు ఎటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు. ముఖ్యంగా రుణ బాధలు వీరికి ఉండవు.

Read more Photos on
click me!

Recommended Stories