వినాయక చవితి రోజున ఏ రాశివారు ఏ మంత్రం జపించాలి? ఏది చదివితే మీ కష్టాలన్నీ తీరుతాయి..?

Published : Aug 25, 2025, 09:49 AM IST

వినాయక చవితి మరో రెండు రోజుల్లో వచ్చేస్తోంది. ఇంటికి గణేశుడిని తీసుకొచ్చి పూజలు చేయడంతో పాటు.. కచ్చితంగా కొన్ని మంత్రాలు పఠించాల్సిందే. ముఖ్యంగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఏ మంత్రం చదవడం మంచిదో తెలుసుకుందామా.. 

PREV
112
1.మేష రాశి...

మేష రాశివారు వినాయక చవితి రోజున ‘ఓం వక్రతుండాయ నమ:’ అనే మంత్రం జపించాలి. దీనిని చదవడం వల్ల జీవితంలో కొత్త ఆరంభాలకు ఏవైనా అడ్డంకులు ఉంటే.. ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చదువులో లేదా ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఎదురైతే.. అవి తగ్గి.. విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. వినాయకుని ఆశీస్సులతో ధైర్యం, నిర్ణయ శక్తి పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గణపతి విగ్రహం ముందు దీపం వెలిగించి కనీసం 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే.. మీ జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు.

212
2.వృషభ రాశి...

వృషభ రాశివారు వినాయకుడి ఆశీస్సులు పొందేందుకు ‘ ఓం గం గణపతయే నమ:’ అనే మంత్రం జపించాలి. ఈ మంత్రం గణపతికి అత్యంత ప్రీతికరమైనది. దీనిని జపించడం వల్ల సంపద, ఐశ్వర్యం లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గి, కుటుంబంలో శాంతి నెలకుంటుంది. వ్యాపారం చేసేవారు కొత్త లాభాలను పొందుతారు. ఈ రాశివారు వినాయక చవితి రోజున పసుపు గణపతిని పూజించి, ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే దేవుడి కృప పొందుతారు.

312
3.మిథున రాశి..

మిథున రాశి వారు వినాయక చవితి రోజున “ఓం ఏకదంతాయ నమః” మంత్రం జపించాలి. గణపతి ఏకదంత రూపం జ్ఞానం, విద్య, మేధస్సుకు సంకేతం. విద్యార్థులకు ఈ మంత్రం చాలా శ్రేయస్కరం. జ్ఞాపకశక్తి పెరిగి చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. ఈ రాశివారు పుస్తకాల దగ్గర గణపతి ఫోటో పెట్టి, ఉదయం, సాయంత్రం ఈ మంత్రాన్ని 9 సార్లు జపిస్తే చదువులో అడ్డంకులు తొలగి, విజయం పొందుతారు.

412
4.కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి శాంతి, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం చాలా ముఖ్యం. వీరు వినాయకుడిని సంతోషపరచడానికి “ఓం హేరంబాయ నమః” మంత్రం జపించాలి. ఈ మంత్రం గణపతి శక్తివంతమైన నామం. దీన్ని జపించడం ద్వారా కుటుంబంలో కలహాలు తగ్గి, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. గృహంలో సౌఖ్యం పెరుగుతుంది. ఈ మంత్రాన్ని 12 సార్లు జపించి, నైవేద్యం పెట్టడం వల్ల గృహంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి.

512
5.సింహ రాశి..

సింహ రాశి వారు వినాయకుడిని సంతోషపరచడానికి ‘ఓం లంబోధరాయ నమ:’, “ఓం సుముఖాయ నమః” మంత్రం జపించాలి. ఈ మంత్రం గణపతి శుభరూపాన్ని సూచిస్తుంది. దీన్ని జపించడం ద్వారా గౌరవం, పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉదయం సూర్యోదయ సమయం ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే, సింహ రాశి వారు విజయం సాధించవచ్చు.

612
6.కన్య రాశి..

కన్యా రాశి వారు వినాయకుడి కృప పొందడానికి “ఓం కపిలాయ నమః” మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు చదువులో కేంద్రీకరణ పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. ఈ మంత్రాన్ని బుధవారం రోజున ప్రత్యేకంగా 21 సార్లు జపిస్తే శుభఫలితాలు పొందవచ్చు.

712
7.తుల రాశి..

తులా రాశి వారికి “ఓం గజాననాయ నమః” మంత్రం అత్యంత శ్రేయస్కరం. ఈ మంత్రం గణపతి గజానన రూపాన్ని సూచిస్తుంది. దీన్ని జపించడం ద్వారా ధనం, సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సాఫీగా పూర్తి అవుతాయి. ఈ మంత్రాన్ని శుక్రవారం రోజున 16 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

812
8.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి వారు వినాయకుడి అనుగ్రహం పొందడానికి “ఓం వినాయకాయ నమః” మంత్రం జపించాలి. ఈ మంత్రం గణపతి ప్రధాన నామం. దీన్ని జపించడం ద్వారా ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు దూరమవుతారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత గణపతికి పూలు అర్పించి ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే శుభం కలుగుతుంది.

912
9.ధనస్సు రాశి..

ధనుస్సు రాశి వారు వినాయకుడి ఆశీస్సులు పొందడానికి “ఓం విఘ్నరాజాయ నమః”,‘ ఓం పార్వతీ నందనాయ నమ:’ అనే మంత్రం జపించాలి. ఈ మంత్రం గణపతి విఘ్నాలను తొలగించే శక్తిని సూచిస్తుంది. దీన్ని జపించడం ద్వారా పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. చదువులో, వ్యాపారంలో, ఉద్యోగంలో సాఫల్యం వస్తుంది. వినాయక చవితి రోజున గణపతికి బెల్లం, ఆకులు నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని 12 సార్లు జపిస్తే మంచిది.

1012
10.మకర రాశి..

మకర రాశి వారు వినాయకుడిని సంతోషపరచడానికి “ఓం గణాధిపతయే నమః”, ‘ఓం గణపతయే నమ:’ అనే మంత్రం జపించాలి. ఈ మంత్రం నాయకత్వం, ధైర్యం, విజయాన్ని ప్రసాదిస్తుంది. దీన్ని జపించడం ద్వారా ఉద్యోగంలో ఉన్నవారికి అధికారి సహకారం లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాల్లో లాభాలను పొందుతారు. ఈ రాశివారు గణపతి విగ్రహం దగ్గర ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అన్ని అడ్డంకులు తొలగి సాఫల్యం దక్కుతుంది.

1112
11.కుంభ రాశి..

కుంభ రాశి వారు వినాయకుడి కృప పొందడానికి “ఓం విఘ్నేశ్వరాయ నమః”, ‘ఓం ఉమా పుత్రాయ నమ:’ అనే మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. విదేశీ అవకాశాలు కోరుకునేవారికి ఇది చాలా శ్రేయస్కరం. విద్యార్థులకు ఉన్నత విద్యలో సాఫల్యం లభిస్తుంది. ఈ రాశివారు ఈ మంత్రాన్ని గణపతి ముందు దీపం వెలిగించి 21 సార్లు జపిస్తే విజయాలు పొందుతారు.

1212
12.మీన రాశి..

మీన రాశి వారికి వినాయకుడి ఆశీస్సులు పొందడానికి “ఓం సిద్ధివినాయకాయ నమః”, ‘ ఓం శూర్పకర్ణాయ నమ:’ అనే మంత్రం చదవడం అత్యంత శ్రేయస్కరం. దీన్ని జపించడం ద్వారా ధనం, విద్య, జ్ఞానం, సంతానం, సౌభాగ్యం లభిస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ మంత్రాన్ని వినాయక చవితి రోజున 12 సార్లు జపించి, గణపతికి లడ్డూలు నైవేద్యం పెడితే శుభఫలితాలు కలుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories