ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
ఉద్యోగులు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.
కొత్త విషయాలు తెలుస్తాయి. బంధు మిత్రులు రాక ఆనందం కలిగిస్తుంది. కొన్ని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
613
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
713
కన్య రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇతరులకు ఏదైనా మాట ఇచ్చేముందు.. ఆలోచించడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.
813
తుల రాశి ఫలాలు
కొత్త పనులకు సమయం అనుకూలించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉండాలి.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.
1113
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పిల్లల చదువుపై దృష్టి పెట్టడం మంచిది.
1213
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం.
1313
మీన రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. నిరుద్యోగులకు అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.