Zodiac sign: ఈ 4 రాశుల వారు భార్య చెప్పినట్లే వింటారు!

Kavitha G | Published : May 11, 2025 1:59 PM
Google News Follow Us

ఒకప్పుడు భార్యా భర్తల బంధంలో భర్త డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. భార్యా, భర్త సమానమనే భావన వచ్చింది. ప్రస్తుతం చాలామంది భర్తలు.. భార్యల మాటల్నే వింటున్నారు. వారు చెప్పిందల్లా చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 4 రాశులవారు భార్య మాటలని శాసనంలా భావిస్తారట. మరి ఆ రాశులెంటో చూద్దామా..!

 

14
Zodiac sign: ఈ 4 రాశుల వారు భార్య చెప్పినట్లే వింటారు!

సింహ రాశి

 

సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. వీరు భార్యకు చాలా విషయాల్లో స్వేచ్చనిస్తారు. ఈ రాశి వారు భార్య ఏం చెప్పినా వింటారు. భార్యను అమితంగా ప్రేమిస్తారు. భార్యా భర్తల బంధంలో నిజాయతీగా ఉంటారు. పెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. భాగస్వామి మాటలను గౌరవిస్తారు.

 

24
కుంభ రాశి

ఈ రాశి వారు పెళ్లి బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. జీవిత భాగస్వామితో బంధాన్ని బలపరచుకోవడానికి తగిన సమయాన్ని కేటాయిస్తారు. భార్యపై ప్రేమ ఉన్నప్పటికీ.. నిజంగా వారు చెప్పినమాట వినరు. విన్నట్లు నటిస్తారు అంతే. అది కూడా ఈ రాశి వారి భార్య కోపంగా ఉన్నప్పుడు లేదా అలిగినప్పుడు దాన్ని తగ్గించడానికి మాత్రమే వారి మాట విన్నట్లు నటిస్తారు.

 

34
మకర రాశి

శని గ్రహం ఈ రాశి వారికి అధిపతిగా ఉండటం వల్ల చాలా విషయాల్లో మొండిగా ఉంటారు. వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమకు నచ్చిన విధంగా జీవించడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో.. ఒక్కసారిగా మారిపోతారు. జీవిత భాగస్వామితో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. వారు ఏం చెప్పినా దానికి ఎదురు చెప్పకుండా వింటారు. రిలేషన్ షిప్ కు ఎక్కువ విలువ ఇస్తారు.

 

44
మీన రాశి

మీనరాశి వారు చాలా విషయాల్లో ఓపికగా ఉంటారు. వీరు ఇతరులతో మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో.. వీరి లైఫ్ చాలా మారిపోతుంది. ఈ రాశివారు ఏ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడరు. ప్రతి విషయాన్ని భార్యతో షేర్ చేసుకుంటారు. ఆమె ప్రతి కోరికను తీర్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. భార్యకు ఎక్కువ గౌరవం ఇస్తారు. వారి మాటలను ఎక్కువగా వింటారు.

Read more Photos on
Recommended Photos