Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు మనసులో మాట కూడా ఎవరికీ చెప్పలేరు..!
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. నిజాయితీకి చాలా పెద్ద పీట వేస్తారు. కానీ వచ్చిన సమస్య అల్లా.. తమ కుటుంబ సభ్యులకు కూడా మనసులో మాట బయటపెట్టరు.
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. నిజాయితీకి చాలా పెద్ద పీట వేస్తారు. కానీ వచ్చిన సమస్య అల్లా.. తమ కుటుంబ సభ్యులకు కూడా మనసులో మాట బయటపెట్టరు.
భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యక్తిత్వం ఉంటుంది. భిన్నమైన మనుషులు భిన్న వ్యక్తిత్వాలతో నిండి ఉంటారు. కొందరు తెలియని వాళ్లతోనూ, తెలిసిన వాళ్లతోనూ ఒకేలా ప్రవర్తిస్తారు. కొత్తవారితోనూ తొందరగా కలిసిపోతారు. మరి కొందరు చాలా మొహమాటంగా ఉంటారు.మనసులో మాట తొందరగా ఎవరికీ బయటపెట్టరు. ఏ విషయాన్ని తొందరగా ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. సంతోషం అయినా, బాధ అయినా, కోపం అయినా తమలో తామే దాచుకుంటారు. మరి, న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలాంటి ప్రవర్తనతో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 4, 8, 11, 17, 22, 26, 31 తేదీల్లో జన్మించిన వారు పూర్తిగా ఇంట్రావర్ట్స్. అంటే, మనసులో విషయాన్ని బయట పెట్టలేరు. అంటే.. వారికి ఇతరులపై ప్రేమ ఉన్నా, కోపం ఉన్నా పైకి చూపించలేరు. కానీ, ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. నిజాయితీకి చాలా పెద్ద పీట వేస్తారు. కానీ వచ్చిన సమస్య అల్లా.. తమ కుటుంబ సభ్యులకు కూడా మనసులో మాట బయటపెట్టరు.తాము చెప్పకుండానే అందరూ అన్నీ అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.
ఈ వ్యక్తులు ప్రేమలో పడితే, అది లోతైన అనుబంధంగా మారుతుంది. కానీ తమ ప్రేమను మాటల్లో చెప్పలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఈ క్రమంలో వీరు ఒంటరిగా మిగిలిపోయిన భావన కలుగుతుంది. జీవిత భాగస్వామి ముందు కూడా, తనను తాను పూర్తిగా వ్యక్తపరచడంలో సంకోచిస్తారు.
ఇక, 4, 8, 13, 22, 23, 31 తేదీల్లో జన్మించిన అబ్బాయిలు తల్లితో ప్రత్యేకమైన అనుబంధం పంచుకుంటారు. చిన్నచిన్న విషయాల్లోనూ తల్లికి తగిన శ్రద్ధ చూపిస్తారు. ఈ బంధం వారి జీవితాంతం మిగిలిపోయే మమకారంగా ఉంటుంది. వివాహం తరువాత కూడా ఈ ప్రేమ తగ్గదు. వారు తమ తల్లికి ముందు ప్రాధాన్యత ఇచ్చే నిబద్ధతను చూపుతారు.
ఇవేవీ తాత్కాలికంగా మారే లక్షణాలు కావు. వీరు పుట్టుకతోనే ఇలా ఉంటారు. వీరిలో ఓ ఆత్మీయత, ఓ పరిపక్వత ఉంది. ఈ వ్యక్తులను అర్థం చేసుకుంటే, వారిలోని అసలైన అందాన్ని చూడగలం.