1.మేష రాశి...
జోతిష్య శాస్త్రం ప్రకారం, మేష రాశివారు సహజంగానే చాలా కోపంగా ఉంటారు. వీరికి ఒక్కసారి కోపం వచ్చింది అంటే... ఇంక ఎవరి మాటా వినరు. ఏ విషయంలో అయినా సరే.. ఎవరైనా వారితో వాదిస్తే.. ఈ రాశి వారికి మరింత కోపం వస్తుంది. కోపంగా ఉన్నప్పుడు వీరు ఎవరి మీద అయినా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. ఆ కోపంలో హాని చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడరు. సమయం తీసుకొని మరీ, ప్రతికారం తీర్చుుకోవాలని అనుకుంటారు. క్షమించడం ద్వారా వీరికి కోపం తగ్గదు. ప్రతికారం తీర్చుకుంటేనే వీరి కోపం చల్లారుతుంది. మానసికంగా, శారీరకంగా బాధ పెట్టాలని చూస్తారు. అందుకే.. ఈ రాశివారికి కోపం తెప్పించకుండా ఉండటమే మంచిది.