
వినాయకుడు శుభాలకు మారుపేరు. ఏ పూజ మొదలుపెట్టాలన్నా, ఏ శుభకార్యం మొదలుపెట్టాలన్నా.. ఆ గణపయ్యను పూజించాల్సిందే. ముఖ్యంగా భారతదేశంలో వినాయక చవితిని అంగరకంగ వైభంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 27వ తేదీన వచ్చింది. మరి.. ఈ వినాయక చవితి రోజున ఏ రాశివారు ఏ రంగు ధరిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందామా..
మేష రాశివారు వినాయక చవితి రోజున ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఈ రంగులు శక్తి,ఉత్సాహం, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. వినాయకుడి ఆశీర్వాదంతో ఈ రాశివారికి కొత్త ఆరంభాలకు మార్గం సుగమం అవుతుంది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మేష రాశివారికి ధన లాభాలు కలుగుతాయి. అదేవిధంగా కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. పూజ సమయంలో ఈ రంగు ధరిస్తే.. గణేశుడి కృప లభిస్తుందని నమ్ముతారు.
వృషభ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రంగు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు సూచిస్తుంది. వినాయకుడి కటాక్షంతో వృషభ రాశివారు ఆర్థికంగా ఎదగటానికి, స్థిరమైన ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది. గ్రీన్ రంగు దుస్తులు ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పనిలో విజయాలు, కుటుంబంలో సమతుల్యం పెరుగుతాయి. ఈ రంగు దుస్తులు వినాయక పూజలో ధరిస్తే గణపతి వారి అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం.
మిథున రాశివారు వినాయక చవితి రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదం. పసుపు రంగు జ్ఞానం, సానుకూలత, ఆనందానికి సూచిక. ఈ రంగు ధరిస్తే మిథున రాశివారికి విద్యా రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వృత్తిలో ఎదుగుదలకు దోహదం చేస్తుంది. గణేశుడు ఈ రంగు ద్వారా భక్తులను జ్ఞానవంతులను చేసి వారి దారిని సులభతరం చేస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన శుభకార్యాలకు కొత్త అవకాశాలు వస్తాయి.
కర్కాటక రాశివారు వినాయక చవితి రోజున తెలుపు లేదా క్రీమ్ కలర్ దుస్తులు ధరించడం ఉత్తమం. ఈ రంగు పవిత్రత, శాంతి చిస్తుంది. ఈ దుస్తులు ధరిస్తే గణేశుడు కుటుంబంలో సౌఖ్యం, సంతోషం, అనురాగం ప్రసాదిస్తారని నమ్మకం. ఆధ్యాత్మికత పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి. తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే గృహంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది.
సింహ రాశివారు వినాయక చవితి రోజున గోల్డెన్ లేదా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఈ రంగు ఆత్మవిశ్వాసం, శక్తి, వైభవానికి సంకేతం. ఈ రంగు దుస్తులు ధరిస్తే సింహ రాశివారికి పదవీ ప్రాప్తి, గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. గణేశుడు సింహ రాశివారికి ధైర్యం, విజయాలను అందిస్తారు.
కన్యా రాశివారు ఆకు పచ్చ లేదా లేత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఈ రంగు శాంతి, సుఖం, ఆరోగ్యానికి సూచిస్తుంది. వినాయకుడి కటాక్షంతో కన్యా రాశివారు వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగించుకొని విజయం సాధిస్తారు. ఈ రంగు దుస్తులు ధరించడం వలన కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. గణేశుడు వారిని దయతో దీవిస్తారు.
తులా రాశివారు వినాయక చవితి రోజున నీలం లేదా లైట్ బ్లూ రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం. ఈ రంగు సమతుల్యం, జ్ఞానం, శాంతికి సూచిక. తులా రాశివారు ఈ రంగు దుస్తులు ధరించడం వలన సంబంధాలలో సౌఖ్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో, వృత్తిలో న్యాయమైన అవకాశాలు దొరుకుతాయి. గణపతి వారి జీవితంలో నూతన అవకాశాలను తెచ్చి అడ్డంకులను తొలగిస్తారని విశ్వాసం. నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే ఆధ్యాత్మిక బలము, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయి.
వృశ్చిక రాశివారు వినాయక చవితి రోజున ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రంగులు ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. ఈ రంగు దుస్తులు ధరిస్తే వృశ్చిక రాశివారికి కొత్త ప్రాజెక్టులు, వ్యాపార అవకాశాలు లభిస్తాయి. శత్రువులపై గెలుపు సాధించగలరు. గణేశుడు వారికి శక్తి, ధైర్యం ప్రసాదిస్తారని నమ్మకం. కుటుంబంలో కూడా శాంతి నెలకొని సౌభాగ్యం పెరుగుతుంది.
ధనుస్సు రాశివారు వినాయక చవితి రోజున పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదం. ఈ రంగులు జ్ఞానం, ఉల్లాసం, అదృష్టానికి సూచిక. ఈ రంగు దుస్తులు ధరిస్తే విద్యలో మంచి ఫలితాలు, ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. గణపతి కటాక్షంతో ధనుస్సు రాశివారు జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని ధన లాభాలను పొందుతారు. పసుపు రంగు దుస్తులు ప్రత్యేకంగా ధన భాగ్యాన్ని పెంచుతాయని నమ్మకం.
మకర రాశివారు వినాయక చవితి రోజున గ్రీన్ లేదా బ్లాక్ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. గ్రీన్ రంగు శాంతి, సంతోషానికి సూచిస్తే, బ్లాక్ రంగు దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఈ రంగులు ధరించడం వలన మకర రాశివారికి ఆర్థిక ప్రగతి కలుగుతుంది. గణేశుడు కష్టాల్లో ఉన్న వారికి మార్గదర్శకత్వం చూపించి అడ్డంకులను తొలగిస్తారని విశ్వాసం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి.
కుంభ రాశివారు వినాయక చవితి రోజున నీలం లేదా ఊదా (వయలెట్) రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదం. ఈ రంగులు జ్ఞానం, ఆవిష్కరణలు, సృజనాత్మకతకు సూచిక. ఈ దుస్తులు ధరించడం వలన కుంభ రాశివారు వృత్తిలో, వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరతారు. గణపతి వారికి కొత్త ఆలోచనలు, విజయవంతమైన మార్గాలను ప్రసాదిస్తారని నమ్మకం. కుటుంబంలో శాంతి, స్నేహబంధాలలో బలమైన అనుబంధం ఏర్పడుతుంది.
మీన రాశివారు వినాయక చవితి రోజున తెలుపు, పసుపు లేదా లైట్ బ్లూ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఈ రంగులు పవిత్రత, జ్ఞానం, భక్తిని సూచిస్తాయి. ఈ రంగు దుస్తులు ధరిస్తే మీన రాశివారు ఆధ్యాత్మికంగా ఎదిగి గణపతి ఆశీర్వాదంతో విజయం సాధిస్తారు. విద్య, వృత్తి, కుటుంబ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. గణేశుడు వారిని సానుకూల మార్గంలో నడిపిస్తారని విశ్వాసం.