నేడు ఈ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు!

Published : Aug 26, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 26.08.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు వస్తాయి.

413
మిథున రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూలం.

613
సింహ రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు వస్తాయి. వృథా ఖర్చులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

813
తుల రాశి ఫలాలు

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన ట్రాన్స్ ఫర్ లు ఉండవు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కుటుంబ పరిస్థితులు మానసికంగా చికాకు తెప్పిస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం ఉండదు.

1113
మకర రాశి ఫలాలు

ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories