Zodiac signs: స్నేహితుల కారణంగా.. ఈ రాశులవారు చెడిపోతారు..!

Published : Oct 08, 2025, 04:16 PM IST

Zodiac signs: చెడు అలవాట్లు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. చాలా మంది చెడు అలవాట్లకు చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. మరి కొందరు స్నేహితుల కారణంగా చెడిపోతూ ఉంటారు. స్నేహితులు చెప్పింది విని జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు.

PREV
15
Zodiac signs

జీవితంలో ప్రతి ఒక్కరికీ స్నేహితులు అవసరం. మన సంతోషం, దుఖం, బాధ, ఓటమి, విజయం అన్నీ స్నేహితులతోనే పంచుకుంటాం. కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేని విషయాలను స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అయితే.. మనకు ఉండే స్నేహితులు అందరూ మంచివాళ్లు ఉండరు. కొందరు మన విజయానికి నిచ్చెనలుగా మారితే... కొందరు మాత్రం...మనల్ని కిందకు లాగేస్తూ ఉంటారు. చాలా మంది ఫ్రెండ్స్ కారణంగా చెడు అలవాట్లు నేర్చుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు మిత్రుల కారణంగా చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం....

25
1.మేష రాశి...

మేష రాశివారి చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ రాశివారు ఎవరినీ ఎప్పుడూ తక్కువగా చేసి చూడరు. తెలిసిన వాళ్లతో, తెలియని వాళ్లతో అందరితో మాట్లాడటానికి ఇష్టపడతారు. స్నేహితులు ఏది చెబితే అది విని దానిని ఫాలో అవుతారు. ఫ్రెండ్స్ చెప్పేది మంచో, చెడో అనే విషయం కూడా ఆలోచించరు. గీసిన గీత దాటరు. స్నేహానికి చాలా విలువ ఇస్తారు. ఆ స్నేహమే ఈ రాశి వారిని ముంచేస్తుంది. ఈ క్రమంలో చెడు అలవాట్లకు బానిసలుగా మారే అవకాశం ఉంది.

35
2.మిథున రాశి...

మిథున రాశివారు స్నేహితులను చాలా గుడ్డిగా నమ్మేస్తారు. ఈ రాశివారికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీరు స్నేహితులను వదలుకోరు. కష్ట సమయంలో కూడా వీరు స్నేహితులను వదిలిపెట్టరు. సంతోషాన్ని, దుఃఖాన్ని సమానంగా అంగీకరిస్తారు. ఫ్రెండ్స్ కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఖరీదైన బహుమతులను ఇస్తారు. వీరు ఫ్రెండ్స్ ని నమ్మినట్లు... ఫ్యామిలీని కూడా నమ్మరు. ఈ క్రమంలో కెరీర్ నాశనం చేసుకుంటారు. చెడు అలవాట్లకు గురౌతారు. అందుకే ఈ రాశివారు స్నేహితులను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

45
3.కర్కాటక రాశి....

కర్కాటకరాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వారు ఎవరినీ బాధపెట్టాలని కోరుకోరు. స్నేహితులు చెప్పిన మాటను కాదు అనలేరు. మంచి అయినా, చెడు అయినా నమ్మేస్తారు. కర్కాటక రాశి వారు తమ స్నేహితులు చెప్పేది ఆలోచించకుండా త్వరగా అంగీకరిస్తారు. దీనిని సద్వినియోగం చేసుకుని, కొంతమంది స్నేహితులు వారిని చెడు అలవాట్లకు గురిచేస్తారు. చెడు వ్యక్తుల సహవాసం వారి మనస్సును చెడు విషయాల వైపు ఆకర్షించేలా చేస్తుంది. వారు ఎల్లప్పుడూ స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. స్నేహితులతో ఉండటం స్వేచ్ఛ అని వారు భావిస్తారు. దీనివల్ల కెరీర్ నాశనం చేసుకుంటారు.

55
వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి వారు ప్రయాణించడం, తిరగడం ఇష్టపడతారు. ఈ ప్రయాణంలో... వారు కొత్త , విభిన్న వ్యక్తులను కలుస్తారు. కొత్తవారితో కూడా స్నేహం చేయాలని అనుకుంటారు. స్నేహితులను ఎలా సెలక్ట్ చేసుకోవాలి అనే విషయం వీరికి తెలీదు. ఈ క్రమంలో చెడు స్నేహాలు చేసే అవకాశం ఉంది. ఆ స్నేహాల కారణంగా.... చెడు అలవాట్లకు బానిసలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories