దీపావళి పండుగ (Diwali 2025) వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి పండుగ నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజున శని గ్రహం వక్ర గమనంలో ప్రయాణించబోతున్నాడు. ఈ వక్రగమనం మీనరాశిలో జరగబోతోంది. ఇది నాలుగు రాశుల వారిని ధనవంతులను చేయబోతోంది.
దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి రాబోతోంది. ఆ రోజున శని గ్రహం మీనరాశిలో వక్రమార్గంలో సంచరించబోతున్నాడు. ఇది అరుదైన శని వక్ర గమనం. దీని వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో శుభప్రదం. వారిపై ధన వర్షం కురిపిస్తుంది.
24
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ దీపావళి పండుగ కలిసివస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఈ శని సంచారం ఎన్నో లాభాలను తెచ్చి పెడుతుంది. కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి శుభవార్త వినిపిస్తుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం.
34
మకర రాశి
మకర రాశికి అధిపతి శని దేవుడు. ఆయన వక్ర గమన సంచారం మకర రాశి వారికి ఎన్నో సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వస్తుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనే అవకాశం కూడ ఉంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ దీపావళి మీకు సంపదాను, గౌరవాన్ని తీసుకొస్తుంది.
కుంభ రాశి వారికి మేలు జరిగే కాలం ఇది. శని వక్ర గమనం వీరికెంతో లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో సంపదకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన పెరుగుతుంది. ఊహించని విధంగా ఆర్థికంగా లాభాలు వచ్చిపడతాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇదెంతో అనుకూల సమయం.