జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని జ్ఞానం, తెలివితేటలు, వాణిజ్య నైపుణ్యాలు, వాక్చాతుర్యం, విద్య, అభివృద్ధికి కారకుడిగా భావిస్తారు. బుధుడి అనుగ్రహం ఉంటే సకల సంపదలు సిద్ధిస్తాయని నమ్ముతారు. బుధుడి దృష్టి సానుకూలంగా ఉంటే పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం అన్నీ నచ్చినట్టు జరుగుతాయట. జ్యోతిష్య పండితుల ప్రకారం అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. దానివల్ల కొన్ని రాశులవారి జీవితం అద్భుతంగా మారనుంది.
పండితుల ప్రకారం.. బుధుడి రాశి మార్పు సాధారణమైనది కాదు. జ్ఞాన ద్వారాలు తెరుచుకునే క్షణం. త్వరలో జరగనున్న బుధుడి సంచారం కొన్ని రాశులవారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. అదృష్టం వారిని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో ఓసారి చెక్ చేసుకోండి.