Drishti Yogam: ఈ 3 రాశుల వారికి త్వరలో డబుల్ బ్యాంక్ బ్యాలెన్స్, సూర్య గురులతో కేంద్ర దృష్టి యోగం

Published : Sep 29, 2025, 10:28 AM IST

అక్టోబర్లో సూర్యుడు, గురు గ్రహం ఒకరికొకరు 90° కోణంలో ఉంటారు. దీని వల్ల కేంద్ర దృష్టి యోగం (Drishti Yogam) ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదం. ఆ రాశులేవో తెలుసుకోండి. 

PREV
14
కేంద్ర దృష్టి యోగం

అక్టోబర్ లో  కేంద్ర దృష్టి యోగం ఏర్పడనుంది.  దీపావళికి రెండు రోజుల ముందు ఈ యోగం ఏర్పడబోతోంది.  అక్టోబర్ 17, 2025 శుక్రవారం నుంచి ఈ యోగం మొదలవుతుంది.  ఉదయం 11:01 గంటలకు సూర్యుడు, గురుడు 90° కోణంలో ఉండి ఈ యోగాన్ని సృష్టిస్తారు. దీని వల్ల కొన్ని రాశుల వారు ఎన్నో లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

24
వృషభ రాశి

కేంద్ర దృష్టి యోగం వల్ల వృషభ రాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. వారి ఇంటిలో ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ పైఅధికారి వ్యక్తి మద్దతు మీకు ఉంటుంది.  సొంత వ్యాపారులకు ఇచ్చిన అప్పులన్నీ తిరిగి వసూలవుతాయి.

34
సింహ రాశి

దీపావళి పండుగకు కొన్ని రోజుల ముందే  సింహ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. వివాహ సంబంధాలు కూడా బలంగా మారుతాయి. ఆర్థికంగా మీరు మంచి  స్థాయికి చేరుకుంటారు. చేతికి డబ్బులు అందుతాయి.  పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. పెళ్లికాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

44
కుంభ రాశి

ఈ యోగం కేవలం వృషభ, సింహ రాశుల వారికే కాదు కుంభ రాశి వారికి లాభాలు తెస్తుంది. వీరి వైవాహిక జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు. ఈ రాశి యువత కెరీర్‌పై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు రావాల్సిన జీతాలు చేతికి అందుతాయి. జీతాలు కూడా పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories