వీరిలో ఉన్న నెగిటివ్స్..
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. కానీ.. వీరికి చాలా తొందరగా విసుగు వచ్చేస్తుంది. ఏదైనా పని ఎక్కువ సేపు చేయాలి అంటే వీరికి విసుగు వచ్చేస్తుంది. ఇలాంటప్పుడే అసహనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త సహనం పెంచుకున్నా, దూర దృష్టి పై ఫోకస్ పెట్టినా వీరి జీవితం ఇంకా బాగుంటుంది.
ఏ రంగంలో బాగా రాణిస్తారంటే...
వారి బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా, మార్కెటింగ్, మీడియా, సేల్స్, ప్రకటనలు వంటి రంగాల్లో వారు రాణించగలరు. ప్రయాణాలపై ఆసక్తి ఉన్నందున టూరిజం, జర్నలిజం వంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రజలతో కలవడం, మెసేజ్‌ను సమర్థంగా చేర్చడం వంటివి వారి ప్రత్యేకతలు.