నేడు వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?

Published : Sep 09, 2025, 06:00 AM IST

9.09.2025 మంగళవారానికి సంబంధించిన వృషభ రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
14
వృషభ రాశి ఫలాలు (కృత్తిక 2, 3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

నేడు వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

24
ఆరోగ్యం

వృషభ రాశివారికి నేడు ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు. ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. 

ఆర్థిక పరిస్థితి

వృషభ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం పొందే అవకాశం ఉంది. పాత అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం.

34
ఉద్యోగం, వ్యాపారం

ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పై అధికారుల నుంచి గుర్తింపు దక్కుతుంది. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు సోదరుల సహకారంతో వివిధ రిక్రూట్‌మెంట్ల సమాచారం, సూచనలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం.

44
సూచనలు:
  • కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి. 
  • వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.  
  • ధైర్యంగా ముందుకు సాగండి.
  • ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి.
  • ఉద్యోగాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి.
Read more Photos on
click me!

Recommended Stories