నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిదికాదు!

Published : Sep 09, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 9.09.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తల్లితరపు బంధువుల నుంచి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్నివైపుల నుంచి ఆదాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉంది.

413
మిథున రాశి ఫలాలు

మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబం విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబం విషయంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో అవాంతరాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.  

813
తుల రాశి ఫలాలు

బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అప్పులు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

1113
మకర రాశి ఫలాలు

నూతన వస్తు, వాహన సౌకర్యాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలం. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. పిల్లల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

1313
మీన రాశి ఫలాలు

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. డబ్బు విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.  

Read more Photos on
click me!

Recommended Stories