నేడు మేషరాశి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి!

Published : Sep 09, 2025, 05:30 AM IST

9.09.2025 మంగళవారానికి సంబంధించిన మేష రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.  

PREV
15
మేష రాశి ఫలాలు (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

నేడు మేషరాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

25
ఆరోగ్యం

మేషరాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు. గ్రహ స్థితుల ప్రభావంతో జీర్ణకోశ సమస్యలు, ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. చిన్న సమస్యే కదా అని పట్టించుకోకపోతే అది పెద్దదిగా మారవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.  

35
ఆర్థిక పరిస్థితి

నేడు ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. నూతన వాహన లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. ఖర్చులకు తగిన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగడం మంచిది.

45
ఉద్యోగం

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించవు. కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. దానివల్ల కొంత నిరాశ కలుగుతుంది. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా.. ప్రయత్నాలు కొనసాగించాలి. 

55
వ్యాపారం

వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువ.. లాభాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యగా తల్లితరపు బంధువులతో వ్యాపార సంబంధాలు ఉన్నవారు వివాదాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఏ నిర్ణయాన్ని అయినా తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

సూచనలు:

  • ధైర్యం, శాంతి, ఓర్పుతో వ్యవహరించండి.
  •  ఆరోగ్యాన్ని పక్కన పెట్టకండి. 
  • ఖర్చుల్లో నియంత్రణ పాటించండి
Read more Photos on
click me!

Recommended Stories