నేడు వృషభ రాశివారు ఈ విషయాల్లో శుభవార్తలు వింటారు!

Published : Sep 12, 2025, 06:00 AM IST

Taurus Horoscope: 12.09.2025 శుక్రవారానికి సంబంధించిన వృషభ రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
14
వృషభ రాశి ఫలాలు (కృత్తిక 2, 3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

నేడు వృషభ రాశివారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

24
ఆరోగ్యం

నేడు వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య పరంగా కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే పని ఒత్తిడితో మానసిక ఆందోళన, ఆవేశం రావచ్చు. కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది.  

ఉద్యోగం

వృత్తి, ఉద్యోగాల్లో వృషభ రాశి వారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పై అధికారులు, తోటివారి సహకారం లభిస్తుంది. ప్రమోషన్‌ కి అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉండటం వల్ల.. కొత్త ప్రాజెక్టుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

34
వ్యాపారం

నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల స్పందన, వ్యాపార భాగస్వాముల సహకారం అన్నీ కలిసివస్తాయి. కొత్త విభాగాలలో విస్తరణ, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఫ్రాంచైజ్ విధానాల్లో ప్రవేశించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది.

44
మంచి ఫలితాలు

నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. గత ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల ఫలితాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారు కొత్త ఉద్యోగం వైపు అడుగులు వేస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories