నేడు ఓ రాశివారి ప్రవర్తన ఇతరులను చాలా ఇబ్బంది పెడుతుంది!

Published : Sep 12, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 12.09.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

313
వృషభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు తప్పవు. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. పిల్లల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల రాకతో ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

నూతన వాహన యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

813
తుల రాశి ఫలాలు

ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంటా బయటా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్థలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories