నేడు మేషరాశి వారికి ఈ విషయాల్లో బాగా కలిసివస్తుంది!

Published : Sep 12, 2025, 05:30 AM IST

Aries Horoscope: 12.09.2025 శుక్రవారానికి సంబంధించిన మేష రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
14
మేష రాశి ఫలాలు (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

నేడు మేషరాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

24
సానుకూల ఫలితాలు

నేడు మేషరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. గతంలో ఎదురైన ఆటుపోట్లు, అనిశ్చితులు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవడం మంచి పరిణామం. దీని వల్ల మేషరాశి వారు ఒత్తిడి లేకుండా, ఉత్సాహంగా మరో పని మొదలు పెడతారు. 

వ్యక్తిగత జీవితం

వ్యక్తిగత జీవితం సైతం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. బంధుమిత్రుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు దక్కుతుంది.

34
వ్యాపారాలు

వృత్తి, వ్యాపారాలలో గతంలో ఎదురైన ఆటుపోట్లు తొలగిపోతాయి. అభివృద్ధి స్థిరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపార భాగస్వాముల నుంచి మంచి సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

44
ఉద్యోగం

ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్‌లు లేదా కొత్త బాధ్యతలు మీ అభివృద్ధికి తోడ్పడుతాయి. పని వాతావరణం చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories