11.09.2025 గురువారానికి సంబంధించిన వృషభ రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నేడు వృషభ రాశివారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
24
ఆర్థిక పరిస్థితి
ఆర్థికంగా నేడు వృషభ రాశి వారికి ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. కష్టానికి తగిన ఫలితం దక్కదు. ముఖ్యంగా వ్యాపారాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు నష్టాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. పెద్ద పెట్టుబడులు, రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ అవసరాలు, వివాదాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి.
34
కుటుంబ జీవితం
కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా సోదరులతో భూ వివాదాలు, ఇతర బంధువులతో అకారణంగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న అపార్థాలు పెద్ద వివాదాలుగా మారకుండా ఉండేందుకు కాస్త ఓపికగా ఉండాలి. చర్చలు, సామరస్యంతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ప్రతికూల వాతావరణం మీ శాంతికి భంగం కలిగించవచ్చు.
ఉద్యోగాల్లో పనిభారం తప్పదు. సకాలంలో పనులు పూర్తిచేయాలని పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకెళ్తే తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు సాధించవచ్చు. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం, వారి సాయం కోరడం ద్వారా పనులు పూర్తిచేసుకోవచ్చు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో కొంత శాంతిని పొందుతారు. ధ్యానం, పూజలు, ఆలయ సందర్శనలు మీ మనోబలాన్ని మరింత పెంచుతాయి.