11.09.2025 గురువారానికి సంబంధించిన మేష రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నేడు మేషరాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
25
ఆర్థిక పరిస్థితి
ఆర్థికంగా మేషరాశి వారికి నేడు కొంత మేలైన లాభాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నూతన వస్తువులు, వస్త్రాలు లాభాలుగా పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అవసరానికి మించి ఖర్చులు చేయకుండా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేస్తే మరింత మేలు జరుగుతుంది.
35
వ్యక్తిగత జీవితం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం వంటివి మానసికంగా సానుకూల ప్రభావం చూపిస్తాయి. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగపూరితమైన అనుభూతులు పొందుతారు. ఇది వ్యక్తిగతంగా మీకు విశ్రాంతిని, ఆనందాన్ని ఇస్తుంది.
ఉద్యోగాల్లో ఇప్పటివరకు ఎదురైన పని ఒత్తిడి కొంత తగ్గి, విశ్రాంతిగా పనులు చేసుకునే అవకాశం లభిస్తుంది. పై అధికారుల నుంచి ఒత్తిడులు తగ్గడం, సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడడం వంటివి మేషరాశి వారికి మంచి వాతావరణాన్ని అందిస్తాయి. తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో చూపించడానికి ఇది సరైన సమయం.
55
వ్యాపారం
వ్యాపారాలు కొంత మందకొడిగా సాగవచ్చు. గతంతో పోలిస్తే అభివృద్ధి రేటు తగ్గినట్టు అనిపించినా.. నష్టాలు మాత్రం రాకపోవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా.. ప్రస్తుత వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడం మంచిది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమం.