
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం దక్కుతుంది.
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉండదు. అన్నదమ్ములతో భూ వివాదాలు వస్తాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
సన్నిహితుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు.
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి.
రావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగుల పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి.
పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు.
చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆస్తి సంబంధ విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి పని ఒత్తిడి పెరుగుతుంది.
సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
పిల్లల చదువుపై దృష్టి సారిస్తారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అవరోదాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక, మానసిక సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకు తెప్పిస్తుంది.
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.