ప్రతిరోజు ఈ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే రాహువు నుంచి తప్పించుకోవచ్చట.. ఎప్పుడో తెలుసుకోండి!

First Published Jan 4, 2022, 5:28 PM IST

హిందూ జ్యోతిష్యశాస్త్రం (Hindu astrology) ప్రకారం రాహుకలాన్ని చెడుకు సూచికగా భావిస్తారు. అయితే రాహుకాలం (Rahukalam) ప్రతి రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అటు ఇటు 90 నిమిషాల పాటు ఉంటుందని హిందూ జ్యోతిష్యం చెబుతోంది. కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే రాహువు నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
 

మనం ఏ శుభకార్యాన్నైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ముందుగా రాహుకాలం లేకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే రాహుకాలం అంటేనే చాలా మందికి భయం (Fear). ఈ సమయంలో ఏ శుభకార్యాన్నైనా చేపట్టిన ఆటంకాలు (Interruptions) కలుగుతాయి. అనుకున్న పనులు జరగవు. కనక రాహుకాలం లేకుండా చూసుకుంటారు.
 

రాహువు క్రూర రూపంతో సింహాన్ని అధిరోహించి ఉంటాడు. రాహువు తండ్రి  కశ్యపుడు (Kashyapudu), తల్లి సింహిక (Simhika),, భార్య కరాళ. క్షిర సాగర మధన సమయంలో రాహు దేవత రూపాన్ని ధరించి మోహినీ చేతి అమృతపానం సేవించాడు. దానిని గమనించిన సూర్య చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుంచి వేరు చేశాడు.
 

ఇలా మొండెం నుంచి తల వేరు కావడంతో రాహువు పామును శరీరంగా పొందాడు అని పురాణ కథనం. రాహువును పాపగ్రహం (Asteroid). రాహువు శరీరం దిగువ భాగం పామును కలిగి ఉండడంతో విషంలాగా (Like poison) భావిస్తారు. విష్ణు మూర్తి రాహువును అనుగ్రహించి  తనకు గ్రహ మండలంలో స్థానం కల్పించాడు.
 

సూర్యచంద్రుల కారణంగా తనకు ఆ దుస్థితి (Misery) ఏర్పడిందని వారిపై శత్రుత్వాన్ని (Hostility) పెంచుకుని గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తూంటాడు. రాహువు గ్రహజన్మను రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో ఎత్తాడు. రాహుకాలం ప్రతిరోజూ ఒకటిన్నర గంట ఉంటుంది.
 

ఈ సమయంలో ఏ శుభకార్యాలను మొదలు పెట్టడం మంచిది కాదని భావిస్తారు. అయితే ఈ సమయంలో దోష నివారణ (Error prevention) కోసం పూజలు నిర్వహిస్తారు. రాహుకాలంలో దుర్గాదేవికి (Durgadevi) నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. అయితే వారంలో ప్రతి రోజు ఏ సమయంలో రాహుకాలం ఉంటుందో హిందూ జ్యోతిష్యం చెబుతోంది.
 

ఇలా రోజులో వచ్చే రాహుకాలాన్ని ఖచ్చితంగా చూసుకుంటూ రాహుకాలం పోయాక మంచి సమయం చూసుకొని వివాహాలు (Weddings), భూమి పూజలు, ఏదైనా దూర ప్రయాణం వ్యాపారాలు (Businesses) వంటివి మొదలుపెడతారు..

ఆదివారం సాయంత్రం (Evening) 4:30 నుంచి 6 గంటల వరకు, సోమవారం ఉదయం (Morning) 7:30 నుంచి 9 గంటల వరకు, మంగళవారం మధ్యాహ్నం 3  నుంచి 4:30 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంటల వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది.
 

click me!