జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆత్మకారకుడైన సూర్యుడి సంచారం అనేక మార్పులకు కారణమవుతుంది. జనవరి 24న సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల ఏ రాశులకు అదృష్టమో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి కీలక స్థానం ఉంది. సూర్యుడు ఆత్మకారకుడు, అధికారానికి, ఆత్మవిశ్వాసానికి, నాయకత్వ లక్షణాలకు ప్రతీక. జనవరి 24న సూర్యుడు, చంద్రుడి నక్షత్రమైన శ్రవణంలోకి ప్రవేశించినున్నాడు. దాని ప్రభావం వ్యక్తుల జీవితం మీద ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. శ్రవణం అంటే “వినడం” కాబట్టి జ్ఞానం, అభ్యాసం, కమ్యూనికేషన్, మార్గదర్శకత్వం వంటి అంశాలు ఈ నక్షత్ర ప్రభావంలో బలపడతాయి. మరి సూర్యుడి సంచారం వల్ల ఏ రాశులవారికి లాభాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం.
25
మకర రాశి
మకర రాశివారికి సూర్యుడి నక్షత్ర మార్పు శుభప్రదంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం మకర రాశిలోనే ఉండటం వల్ల, సూర్యుడు ఈ రాశిలో సంచరిస్తున్నప్పుడు వ్యక్తిత్వ వికాసం, అధికార సంబంధిత విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి గుర్తింపు, బాధ్యతలు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగి, జీవిత లక్ష్యాలపై స్పష్టత ఏర్పడుతుంది.
35
కుంభ రాశి
కుంభ రాశివారికి కూడా సూర్య సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. శ్రవణ నక్షత్ర ప్రభావం వల్ల విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి, అంతర్గత మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు పెరిగినప్పటికీ అవి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. రీసెర్చ్, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి కాలం.
కన్య రాశివారికి సూర్యుడి నక్షత్ర మార్పు ప్రత్యేకమైన లాభాలను ఇస్తుంది. చదువు, సృజనాత్మకత, పిల్లల విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి స్పష్టత, నమ్మకం పెరుగుతాయి. అలాగే రచన, మీడియా, బోధన వంటి రంగాల్లో ఉన్నవారికి పేరు ప్రతిష్ఠలు వచ్చే అవకాశం ఉంది.
55
వృషభ రాశి
వృషభ రాశివారికి కూడా సూర్య సంచారం లాభాన్ని ఇస్తుంది. శ్రవణ నక్షత్ర ప్రభావంతో ఈ రాశివారి భాగ్యం బలపడుతుంది. గురువులు, పెద్దల సహకారం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా విదేశీ సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.