Zodiac signs: బంగారం, వెండి కాదు.. రాగి కడియం చాలు..ఈ రాశుల అదృష్టం రెట్టింపు కావడం ఖాయం

Published : Jan 23, 2026, 02:21 PM IST

Zodiac signs: రాగి కడియం లేదా కంకణం ధరించడం ఆరోగ్యానికి మంచిది.శాస్త్రాల ప్రకారం, రాగి కంకణం ధరించడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కొందరికి అదృష్టం పెరుగుతుంది 

PREV
14
Zodiac signs

ప్రతి లోహానికి దాని సొంత ప్రత్యేక గ్రహాలు ఉంటాయి. రాగి సూర్యుని లోహం. అలాంటి ఈ రాగి కడియం ధరించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో శ్రేయస్సు, సంపద పెంచుతాయి.దీనిని ధరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

24
మేష రాశి..

జోతిష్యశాస్త్రం ప్రకారం మేష రాశివారికి రాగి అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన లోహంగా పరిగణిస్తారు. మేష రాశికి అధిపతి అయిన అంగారక గ్రహానికి రాగి సంబంధించిన లోహం కాబట్టి... వీరికి చాలా మేలు చేస్తుంది. ఈ రాశివారు రాగి కడియం ధరించడం వల్ల వీరి ఆత్మ విశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వారు కష్టమైన పరిస్థితులలో కూడా ఏ పని అయినా సులభంగా చేయగలరు. వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అదృష్టం పెరుగుతుంది.

34
వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి కూడా అంగారక గ్రహానికి సంబంధించినది కాబట్టి, ఈ రాశివారు రాగి కడియాన్ని ధరించడం వల్ల వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. కెరీర్ లో మంచి స్థాయికి వెళ్లగలరు. వీరి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగే సత్తా పెరుగుతుంది.

44
ధనుస్సు రాశి...

రాగి గురు గ్రహానికి సంబంధించిన లోహం. కాబట్టి గురు గ్రహానికి చెందిన ధనుస్సు రాశివారు దీనిని ధరిస్తే.. అది వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.దీని వల్ల ధనుస్సు రాశివారు అనేక పనులలో ఆశించిన ఫలితాలను పొందుతారు.ముఖ్యంగా చదువుకునే పిల్లలు దీనిని ధరించడం వల్ల వారి తెలివితేటలు పెరిగి.. మంచి ప్రయోజనాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కలిసొస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories