Sun Transit: సొంతరాశిలోకి సూర్యుడు, ఈ 4 రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు

Published : Sep 13, 2025, 04:07 PM IST

జ్యోతిషశాస్త్రంలో సూర్య సంచారం (Sun) ఎంతో ముఖ్యమైనది.  సూర్య భగవానుడు తన సొంత నక్షత్రానికి ప్రవేశించడం వల్ల 4 రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. వారికి కొన్ని రోజుల పాటూ ఆర్ధికంగా విపరీతంగా కలిసివస్తుంది. 

PREV
15
సొంత రాశిలోకి సూర్యుడు

జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం సూర్యుడిని గ్రహాల రాజుగా చెప్పుకుంటారు. సెప్టెంబరు 13న సూర్యుడు తన సొంత నక్షత్రమైన ఉత్తర నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇలా సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల 12 రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

25
మేష రాశి

సూర్య భగవానుడు ఉత్తర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఉద్యోగంలో  శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల కనిపిస్తాయి. సూర్య సంచారం వల్ల కుటుంబ సమస్యలు తగ్గుతాయి.  కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి జీతంతో మంచి ఉద్యోగం దొరుకుతుంది.

35
కర్కాటకం

సూర్యుని నక్షత్ర సంచారం అనేది కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. సూర్యుడి వల్ల వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  వైవాహిక సంబంధం బలపడుతుంది.  జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వ్యాపారస్తులకు మంచి సమయం. వివిధ ఒప్పందాల ద్వారా లాభాలు పొందుతారు. మీరు చేసిన పెట్టుబడుల నుండి డబ్బు వస్తుంది. ఉద్యోగంలో రాణిస్తారు.

45
సింహ రాశి

సింహ రాశి వారికి సూర్యుని నక్షత్ర సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీ శ్రమకు తగ్గ విజయం దక్కుతుంది.  కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.  భూమి, ఇల్లు, భవనం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

55
తులా రాశి

తుల రాశి వారికి సూర్యుని నక్షత్ర సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి రోజులు. చేస్తున్న పనిలో విజయం సాధించవచ్చు. కొత్త టెండర్లు, ఒప్పందాల ద్వారా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories