Zodiac signs: అన్నదమ్ముల మధ్య మంచి బాండింగ్ ఉంటే.. ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కొన్ని రాశులవారు సోదరులుగా మారినప్పుడు మాత్రమే బెస్ట్ బ్రదర్స్ అవుతారు. వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కష్టాల్లోనూ తోడు ఉంటారు.
తోడ బుట్టిన వారిపై అమితమైన ప్రేమ చాలా మందికి ఉంటుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారు మాత్రం అందరికంటే ఎక్కువ ప్రేమ చూపించగలరు. ఏ రాశివారికి ఏ రాశివారితో మంచి బాండింగ్ ఉంటుంది..? ఎవరు ఉత్తమ బ్రదర్స్ అవ్వగలరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
26
1.మేషం-వృషభం...
మేష రాశివారికి కాస్త స్వార్థం ఎక్కువ. ఎవరి గురించి ఆలోచించకుండా.. కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ.. వృషభ రాశివారు అందుకు భిన్నంగా ఉంటారు. వీరికి ఓపిక చాలా ఎక్కువ. ప్రతిదానికీ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అందుదకే.. ఈ రెండు రాశుల మధ్య బాండింగ్ బాగా కుదురుతుంది. ఒకరికొకరు మంచి సపోర్ట్ గా నిలుస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలుస్తారు. ఈ రెండు రాశుల మధ్య విభేదాలు రావు. అందుకే.. బెస్ట్ బ్రదర్స్ అవుతారు.
36
2.కర్కాటక రాశి- ధనస్సు రాశి...
కర్కాటక రాశి, ధనస్సు రాశి వారు కూడా మంచి బ్రదర్స్ అవ్వగలరు. నిజానికి, కర్కాటక రాశివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా ఎమోషనల్ గా కూడా ఉంటారు. ఇక.. ధనస్సు రాశివారు... తమ తోడు బుట్టిన వారికి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలో వీరు ముందుంటారు. ఒకరిపై మరొకరికి మంచి ప్రేమ ఉంటుంది. వీరి మధ్య అపార్థాలు రావు. ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకుంటారు. అందుకే.. ఈ రెండు రాశులవారు కూడా మంచి బ్రదర్స్ అవ్వగలరు.
ఈ రెండు రాశులకు చెందిన వారు సహజంగా చాలా తెలివైన వారు. మిథున రాశివారు బహిరంగ వైఖరిని కలిగి ఉంటారు. ఈ రాశివారు స్వేచ్ఛను ఇష్టపడతారు. కుటుంబం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ, కన్య రాశివారు నిజాయితీగా.. బాధ్యతగా ఉంటారు. వీరి మధ్య విభేదాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోరు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇద్దరూ కలిసి తమ శత్రువులను దూరం చసుకుంటారు.
56
4.సింహ రాశి- వృశ్చిక రాశి...
ఈ రెండు రాశుల వారు బలమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. వారు తెలివైనవారు , ఆలోచనాపరులు. వీరు ఏ విషయంలోనూ తొందరగా గొడవలు పడటానికి ఇష్టపడరు. అనుకోకుండా సమస్యలు వచ్చినా... మాట్లాడి పరిష్కరించుకుంటారు. వారు క్లిష్ట సమస్యలలో కలిసి ఉంటారు. ఒకరి కష్టాలకు ఒకరు స్పందిస్తారు. వారి మధ్య ఉన్న లోతైన బంధం,ప్రేమ ఇతరులకు కనిపించకపోవచ్చు. కానీ ఈ ఇద్దరూ ఒకరికొకరు ఆదర్శప్రాయులైన అద్భుతమైన సోదరులుగా తమ జీవితాలను గడుపుతారు.
66
5.మకర రాశి- కుంభ రాశి...
మకర రాశివారు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. మరోవైపు, కుంభ రాశివారు చాలా ఊహాత్మకంగా ఉంటారు. సృజనాత్మకంగా ఉంటారు. కుంభ రాశివారు దాదాపు అన్ని విషయాల్లో మకరరాశి వారితో కూడా ఏకీభవిస్తారు. వారు ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి ముందుడుగు వేస్తారు. ఒకరితో మరొకరు కలిసి ఉండి... సమస్యలను పరిష్కరించుకుంటారు.