సూర్యభగవానుడు తులారాశికి ఏడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఏడవ ఇల్లు వృత్తి, వివాహం, భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో సూర్యుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి, పరస్పర ప్రేమ, అవగాహన బలపడతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. విడిపోయిన భార్యాభర్తల వారు మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి.