Birth Date: చదువు కోకపోతే జీవితంలో ఏదీ సాధించలేరు అని పేరెంట్స్ తిడూ ఉంటారు. కానీ, కొన్ని తేదీల్లో పుట్టిన వారు చదువులో వెనకపడినా.. లైఫ్ లో మాత్రం వెనకపడరు. జీవితంలో గెలిచి తామేంటో నిరూపించుకుంటారు. ఆ తేదీలేంటి అంటే...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించినవారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్నతనంలో చదువులో కాస్త ఎక్కువ వెనకపడే అవకాశం ఉంటుంది. సరిగా మార్కులు రాకపోవచ్చు. వీరు స్లో లెర్నర్స్. చాలా నెమ్మదిగా నేర్చుకుంటారు. చదువులో చురుకుగా ఉండరు.
కానీ ఈ తేదీల్లో పుట్టిన వారికి ఓర్పు, పట్టుదల చాలా ఎక్కువ. జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వీరి వయసు 30 ఏళ్లు దాటిన తర్వాత వీరి జీవితంలోకి అదృష్టం అడుగుపెడుతుంది. అప్పటి నుంచి వీరు అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గొప్ప హోదా, అధికారాన్ని పొందుతారు.
24
నెంబర్ 4...
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహువు ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా చిన్నతనంలో చదువులో ఎక్కువగా వెనకపడే అవకాశం ఉంటుంది.వీరికి పుస్తకాల కంటే.. బయటి ప్రపంచంపై వీరికి ఆసక్తి చాలా ఎక్కువ. అందుకే, మార్కులు తక్కువగా రావచ్చు. కానీ.. వీరు ప్రాక్టికల్ గా మాస్టర్స్. ఏ పని అయినా ఎలా పూర్తి చేయాలో వీరికి తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు. వ్యాపార రంగంలో లేదా కొత్త ఆవిష్కరణలలో వీరు తిరుగులేని విజయం సాధిస్తారు.
34
నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కి చెందిన వారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్లాస్ రూమ్ లో కూర్చొని పాఠాలు వినడం చాలా మందికి బోర్ గా అనిపించొచ్చు. ఆ క్లాసులు వినరు. ఏదో ఆలోచనల్లో ఉండిపోతారు.
అయితే.. ఈ తేదీల్లో పుట్టిన వారికి మనుషులను అంచనా వేసే శక్తి చాలా ఎక్కువ. జీవిత పాఠాలను వంటబట్టించుకుంటారు. పరిశోధన, సైకాలజీ లేదా క్రియేటివ్ రంగాల్లో వీరు టాప్ గా నిలుస్తారు.