Saturn Rise: జోతిష్యశాస్త్రం ప్రకారం, శని గ్రహం అస్తమించిన 40 రోజుల తర్వాత మళ్లీ ఉదయిస్తాడు. ఏప్రిల్ శని ఉదయించడం వల్ల మూడు రాశుల కష్టాలు తీరిపోతాయి. మరి, ఆ రాశులు ఏంటో చూద్దాం….
జోతిష్య శాస్త్రం ప్రకారం. శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ శని గ్రహం మీన రాశి లో ఉంది. ఈ సమయంలో తన గమనాన్ని, స్థానాన్ని చాలాసార్లు మార్చుకుంటాడు. ఈ క్రమంలో శని ఉదయించడం, అస్తమించడం చేస్తాడు.
మార్చి 13,2026 వ తేదీన శని అస్తమించాడు. 40 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 22,2026న తిరిగి ఉదయిస్తాడు. మీన రాశిలో శని ఉదయించడం వల్ల మూడు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శని నెమ్మదిగా కదిలే గ్రహమైనప్పటియీ. మీన రాశిలో ఉదయించడం వల్ల మూడు రాశులకు అదృష్టం కలగనుంది.
24
వృషభ రాశి
జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని ఉదయం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు సంపద, ప్రేమ, సంతోషాన్ని పొందుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత పదవిని కూడా పొందవచ్చు. చాలా కాలంగా ఉన్న ఓ పెద్ద కోరిక నెరవేరుతుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం కూడా ఉంది.
34
మిథున రాశి
శని ఉదయం మిథున రాశి వారికి కెరీర్‌లో మంచి వృద్ధిని తీసుకురాగలదు. కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మిథున రాశి వారిలో కొందరికి అవార్డులు లేదా గౌరవాలు లభించే అవకాశం కూడా ఉంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుంభ రాశిలో శని ఉదయించడం వల్ల ఏలినాటి శని కష్టాలు తగ్గుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలో ఏలినాటి శని మూడో దశ నడుస్తోంది. శని వెళ్లే ముందు వీరికి ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాడు. మీకు పెద్ద వ్యాపార ఆర్డర్ లభించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.