Saturn Jupiter Transit: శని, గురు నక్షత్రాల మార్పు.. ఈ 5 రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

Published : Apr 26, 2025, 02:27 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో గురు, శని గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. శనిని కర్మఫలాలు ఇచ్చే గ్రహంగా భావిస్తారు. శని సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఏప్రిల్ 28న శని, గురు.. నక్షత్రాలు మారనున్నాయి. దానివల్ల 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయట. మరి ఆ రాశులెంటో వారికి కలిగే లాభాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Saturn Jupiter Transit: శని, గురు నక్షత్రాల మార్పు.. ఈ 5 రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

మేషరాశి వారికి కలిగే లాభాలు

మేష రాశి వారికి ఏప్రిల్ 28 నుంచి వృత్తి జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

25
వృషభ రాశి

వృషభ రాశి వారికి ఏప్రిల్ 28 తర్వాత గురు, శని గ్రహాలు శుభ ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. పదోన్నతి, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసినా దాంట్లో విజయం లభిస్తుంది.

35
కన్య రాశి

కన్య రాశి వారికి గురు, శని కలిసి ఓర్పు, కృషి, స్థిరమైన అభివృద్ధిని సూచిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం, గౌరవం పెరుగుతాయి. వ్యాపారుల ప్రణాళికలు పూర్తవుతాయి. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

45
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఏప్రిల్ 28 తర్వాత కొత్త శక్తిని పొందుతారు. గురు, శని కలిసి జ్ఞానం, మార్గదర్శకత్వం అందిస్తాయి. పరిశోధన, వైద్య, న్యాయ రంగాల్లో పనిచేసేవారికి ఇది చాలా మంచి సమయం.

55
మీన రాశి

మీన రాశి వారికి ఏప్రిల్ 28 తర్వాత ఉన్నత విద్యలో విజయం లభిస్తుంది. శని క్రమశిక్షణను కలిగిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories