ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?

Published : Nov 20, 2025, 07:10 PM IST

Sleep: హిందూ ధ‌ర్మంలో ఎన్నో విష‌యాల‌ను వివ‌రించారు. ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా కూర్చోవాలి. చివ‌రికి ఎలా ప‌డుకోవాల‌న్న విష‌యంలో కూడా కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. నిద్ర‌కు సంబంధించి ఇలాంటి ఒక న‌మ్మ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
కాలుపై కాలు వేసుకొని ప‌డుకోవ‌డం త‌ప్పా.?

హిందూ సంప్రదాయంలో కాలుపై కాలు వేసుకొని కూర్చోవ‌డం లేదా నిద్ర‌పోవ‌డం అశుభంగా భావిస్తారు. ఇది శాస్త్రాల ప‌రంగా, జ్యోతిష్యంగా కూడా మంచి అలవాటు కాదు. దీనిని త్రిభంగి స్థితి అంటారు. ఈ స్థితిలో ఉండటం శరీరానికీ, మనసుకీ, ఆధ్యాత్మిక శక్తులకీ మంచిది కాదని చెబుతారు.

25
పౌరాణిక కథ ప్రకారం..

పురాణాల్లో చెప్పిన కథ ప్రకారం.. శ్రీకృష్ణుడు ఒక రోజు పాదంపై పాదం పెట్టి త్రిభంగి ముద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ స‌మ‌యంలో ఆయన కాలి వద్ద ఉన్న రత్నం (మణి) ప్రకాశిస్తోంది. ఒక వేటగాడు ఆ మణిని జింక కంటి వెలుగు అని భావించి బాణం వదిలాడు. ఆ బాణం శ్రీకృష్ణుని పాదానికి తగిలింది. దీని తర్వాత ఆయన వైకుంఠానికి ప్రవేశించినట్లు పురాణాల్లో చెబుతాయి. ఈ కథ ఆధారంగా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. కాలుపై కాలు పెట్టుకొని పడుకుంటే ఆయుష్షు తగ్గుతుంది అని. అందుకే ఇళ్లలో పెద్దలు కూడా ఈ అలవాటు మానుకోవాలని చెబుతారు.

35
శాస్త్రాల ప్రకారం ఎందుకు మంచి కాదు?

హిందూ శాస్త్రాల ప్రకారం కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం లేదా నిద్రపోవడం వల్ల. దేవతల కటాక్షం తగ్గుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందని, ఆర్థిక సమస్యలు వ‌స్తాయ‌నే ఓ న‌మ్మ‌కం ఉంది. కాగా ఈ అలవాటు అహంకారాన్ని పెంచుతుందని కూడా కొన్ని గ్రంథాలు చెబుతాయి.

45
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది.?

జ్యోతిష్య ప్రకారం.. దక్షిణ దిశ వైపు కాలుపై కాలు వేసుకొని ప‌డుకుంటే చెడు క‌ల‌లు వ‌స్తాయ‌ని శాస్త్రం చెబుతోంది. మనసు అస్థిరంగా ఉంటుంది, నిద్ర నాణ్యత తగ్గుతుంది. అందుకే జ్యోతిష్యులు ఉత్తర దిశ వైపు కాలు పెట్టి నిద్రపోవడం శ్రేయస్కరం అంటారు. కానీ కాలుపై కాలు వేసుకొని మాత్రం ప‌డుకోకూడ‌దు.

55
ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు

ఆధ్యాత్మికం – జ్యోతిష్యంతో పాటు వైద్యపరంగా కూడా ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు చెబుతారు. ఇలా ప‌డుకోవ‌డం వ‌ల్ల రక్త ప్రసరణలో అంతరాయం కలుగుతుంది. కాళ్ల నొప్పులు, నరాల బిగుతు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర సరిగా పట్టదు. అందుకే ఇది శరీరానికీ, మనసుకీ, నిద్రనాణ్యతకీ మంచిది కాదని ఈ అల‌వాటును మానుకోమ‌ని పండితులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories