Zodiac Signs: సూర్యచంద్రుల శశి ఆదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!

Published : Jun 24, 2025, 02:38 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్రులను ప్రధాన గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు కలిసి నేడు (మంగళవారం) శక్తివంతమైన శశి ఆదిత్య రాజయోగాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రభావం 3 రాశులపై పడనుంది. మరి శుభ ఫలితాలను పొందే ఆ రాశులేంటో ఓసారి చూసేయండి. 

PREV
14
శశి ఆదిత్య యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు క్రమం తప్పకుండా సంచరిస్తూ ఉంటాయి. అనేక శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తుంటాయి. అశుభ యోగమైతే కొన్ని రాశులవారి జీవితాల్లో కష్టాలు వస్తాయి. శుభప్రదమైన రాజయోగం ఏర్పడితే జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు వస్తాయి. 

సరిగ్గా అలాంటి ఒక శుభ రాజయోగం నేడు(మంగళవారం) ఏర్పడనుంది. నేడు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు, గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నారు. చంద్రుడు, సూర్యుని సంయోగం వల్ల శశి ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సంయోగం వల్ల చాలా రాశులకు అదృష్టం ప్రకాశిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

24
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శశి ఆదిత్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. దీని ప్రభావంతో మీ సృజనాత్మకత పెరుగుతుంది. భావోద్వేగాలపరంగా బలంగా ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. ఉన్న వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

34
కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రాజయోగం చాలా ప్రయోజనాలు తెస్తుంది. ఉద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రమోషన్ లేదా మంచి జీతం పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్ లో మీ బాధ్యతలు పెరగవచ్చు.

కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మీడియా, మార్కెటింగ్, ఐటీ రంగాల్లో పనిచేసేవారు ఆర్థికంగా బలపడుతారు. 

44
మిథున రాశి

మిథున రాశి జాతకుల లగ్నంలో శశి ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 

స్థలం కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించవచ్చు. లేదా కుటుంబం కోసం కొత్త కారు కొనాలని ఆలోచించవచ్చు. పెళ్లి కానివారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories