రాజయోగం..
జోతిష్య శాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి గ్రహాలు మారడం వల్ల కొన్ని శుభ మరికొన్ని అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తాయి. జూన్ 24వ తేదీన ఒకేసారి ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగాల పేర్లు గజకేసరి, మాల్వీయ, భద్ర, మహాలక్ష్మీ, బుధారిత్య రాజయోగాలు. ఈ ఐదు రాజయోగాలు దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఏర్పడుతుండటం విశేషం. ఈ రాజయోగాలు ఏర్పడటం వల్ల అన్ని రాశులపై ఎక్కువ ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం యోగం కలగనుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..