Zodiac signs: జూలై 13 నుంచి ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే?

Published : Jul 06, 2025, 08:24 AM ISTUpdated : Jul 06, 2025, 10:26 AM IST

జ్యోతిష్య శాస్త్రంలో శ‌ని గ్ర‌హానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. అత్యంత నెమ్మ‌దిగా క‌దిలే గ్ర‌హంగా పేరుగాంచిన శ‌ని మ‌న జీవితాల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఈ క్ర‌మంలోనే జూలై 13వ తేదీ నుంచి శ‌ని తిరోగ‌మ‌నం చెంద‌నుంది. ఇది కొన్ని రాశుల వారిపై ప్ర‌భావం చూప‌నుంది. 

PREV
16
శని తిరోగమన పరిణామాలు

జ్యోతిష శాస్త్రంలో శని ఒక శక్తివంతమైన గ్రహం. ఇది నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి, దాని ప్రభావం చాలా కాలం ఒకే రాశిపై ఉంటుంది. శని తిరోగమనం అంటే శని తాను సాగుతున్న దిశకు వ్యతిరేకంగా కదిలే స్థితి. ఇది సాధారణంగా కొన్ని రాశులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. 2025లో శని జూలై 13న ఉదయం 7:24 గంటలకు తిరోగమనంలోకి ప్రవేశించి, నవంబర్ 28 వరకు అదే స్థితిలో ఉంటాడు.

26
2025 శని తిరోగమన ముఖ్య తేదీలు

* శని తిరోగమన ప్రారంభం జూలై 13, 2025 – ఉదయం 7:24 గంటలకు

* శని తిరోగమన ముగింపు: నవంబర్ 28, 2025 – ఉదయం 7:26 గంటలకు

* మొత్తం తిరోగమన కాలం: 138 రోజులు. మీన రాశిలో శని తిరోగమనంగా కొనసాగుతుంది. ఏయే రాశుల‌పై ప్ర‌భావం చూప‌నుంది.

36
వృషభ రాశి

వృష‌భ రాశి వారికి ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. వృషభరాశివారికి ఈ శని తిరోగమన కాలం కాస్త ఒత్తిడిగా ఉంటుంది. డబ్బు విషయాల్లో ఊహించని ఖర్చులు రావచ్చు. ఉద్యోగంలో చికాకులు, వాయిదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ సమయంలో ఆర్ధిక ప్లానింగ్‌లో జాగ్రత్తగా ఉండాలి. సంయమనంతో వ్యవహరించడం మంచిది.

46
కర్కాటక రాశి

క‌ర్కాటక రాశి వారికి కూడా ఈ స‌మ‌యంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. ప్రయత్నాలన్నీ అర్థవంతంగా మారకపోవచ్చు. కర్కాటక రాశివారికి ఇది మంచి సమయం కాదు. చేసే పనులు కూడా మధ్యలో అటకెక్కే అవకాశం ఉంది.

గౌరవం, పేరుప్రతిష్టలో స్వల్ప నష్టాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్ప‌డుతాయి. ఈ రాశి వారు అదృష్టం మీద కాకుండా, స్వయంగా కృషి మీద ఆధారపడండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగ‌డం మంచిది.

56
మీన రాశి

శ‌ని గ్ర‌హం మీన‌ర రాశి వారికి సొంతింటిలో తిరోగ‌మ‌నంలో ఉంటుంది. ఈ కార‌ణంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు, చిన్న గొడవలు జ‌రిగే అవ‌కాశం ఉంది. పనుల్లో ఆలస్యం, నిరాశలు కలగచ్చు. ఈ సమయంలో సానుకూలంగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి.

66
శని తిరోగమనం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు

శనివారాలలో శని భాగవానిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠనం చేయడం శుభప్రదం. పేదలకు నల్ల బట్టలు, నల్ల శనగలు దానం చేయడం మంచిది. శని తిరోగమనం అనేది ప్రతి రాశికి ఒక పరీక్ష లాంటిది. కొన్ని రాశులకు ఇది శుభదాయకంగా మారవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories